భవిష్యత్ దర్ళనం చేయించిన మోడీ

ప్రధాని మోడీని మెచ్చుకోవాలి. ప్రజల్ని ఒకేసారి భయాందోళనలను గురి చేయకుండా, మెల మెల్లగా జనాలకు విషయాన్ని ఇంజెక్ట్  చేసే పని చేపట్టారు. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పనిని దాదాపు గత పది…

ప్రధాని మోడీని మెచ్చుకోవాలి. ప్రజల్ని ఒకేసారి భయాందోళనలను గురి చేయకుండా, మెల మెల్లగా జనాలకు విషయాన్ని ఇంజెక్ట్  చేసే పని చేపట్టారు. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పనిని దాదాపు గత పది రోజులుగా మెల్లగా స్టార్ట్ చేసాయి. వ్యవస్థలను వాటి అంతట అవే మెలమెల్లగా మూత వేయడం స్టార్ట్ చేసాయి. రద్దీ లేకుంటే స్పెషల్ రైళ్లు నడపరు కానీ, వున్న రైళ్లు క్యాన్సిల్ చేయడం ఎప్పుడూ లేదు. అలాంటిది 200 వరకు రైళ్లురద్దు చేసారు. థియేటర్లను, మాల్స్ ను మెలమెల్లగా క్లోజ్ చేయడం ప్రారంభించారు.

ఇన్ని చేసిన తరువాత ఇప్పుడు ప్రధాని మోడీ మెల్లగా అసలువిషయం బయట పెట్టారు. కరోనాను తక్కువ అంచనా వేయవద్దని, దానికి మందు కనిపెట్టడం సాధ్యం కావడం లేదని, జనం వాళ్లంతట వాళ్లే కర్ఫ్యూ ను విధించుకుని ఇళ్లకు పరిమితం కావాలని కోరారు.

అదే కనుక ప్రధాని ప్రతి ఆదివారం కర్ఫ్యూ అనో, లేదా రోజూ ఈ టైమ్ ల్లో కర్ఫ్యూ అనో అని వుంటే, పరిస్థితి వేరుగా వుండేది. జనం పానిక్ అయ్యే ప్రమాదం వుంది. అందుకే మోడీ ప్రసంగం అంతా ఒక ఇంటి పెద్ద పిల్లలకు సుద్దులు చెప్పినట్లు సాగింది. భయపెట్టకుండానే, భయపడాల్సిన అవసరం వుందని చెప్పకనే చెప్పారు. మరి కొన్ని రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుందని ముందుగానే ప్రిపేర్ ఛేసారు. 

బ్లాక్ మార్కెట్ కీలకం

ఇండియాలో ఏ సమస్య వచ్చినా ముందుగా జరిగేది బ్లాక్ మార్కెట్. దాని గురించి కూడా అన్యాపదేశంగా పస్తావించారు. సరుకులు ఇంటికే పంపిస్తామని అన్నారు. అయితే ఆ  విషయంలో మరింత లోతుకు వెళ్లలేదు. అయితే మోడీ కేవలం జనాలను ఇళ్లకు పరిమితం అయ్యేలా చేసి, కరోనా వ్యాప్తిని అరికట్టే ఆలోచనలు  మాత్రమే తన ఉపన్యాసంలో పంచుకున్నారు.

మిగిలిన విషయాల జోలికిపోలేదు.  దేశ ఆర్థికవ్యవస్థ గురించి ఎక్కువగా ప్రస్తావించలేదు. కానీ రెండు నెలల పాటు దేశంలో కరోనా పాతకుపోయి వుంటే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్భాభిన్నం అవుతుంది. అది వాస్తవం. మొదటి ప్రపంచయుద్దం లాంటి పరిస్థితులు అని మోడీ వెనుక వైనం ఇదే కావచ్చు.  రోజువారీ కార్మిక వ్యవస్థ ఈ రెండు నెలలు కుప్పకూలుతుంది. వారిని ఆదుకోవాల్సి వుంది. 

యూరోపియన్ దేశాల్లో టాక్స్ లు రద్దు, ఈఎఎమ్ఐ లు వాయిదా వేయడం వంటి ఉపశమన చర్యలు  తీసుకుంటున్నాయి. ఇండియాలో ఇలాంటివి ఆశించడం కష్టం. ముఖ్యంగా మోడీ ప్రభుత్వంలో.  జనాలను ఇళ్లకు పరిమితం చేసి, వ్యాధిని వ్యాప్తి కాకుండా చేయడానికి కాస్త గట్టి కృషి చేయడానికి చూస్తున్నారు. తద్వారా వీలయినంత త్వరగా వాణిజ్య వ్యవస్థలు అన్నీ కుదుట పడితే, ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు అన్నవి మోడీ ఆలోచన కావచ్చు. 

మొత్తం మీద మోడీ స్పీచ్ చాలా నెమ్మదిగా, ప్రశాంతంగా సాగినా, భవిష్యత్ అంత సుందరంగా వుండబోవడం లేదనే భవిష్యత్ దర్శనం చేయించింది.

నమస్కారం మన సంస్కారం