దర్శకుడు అనిల్ రావిపూడికి ఓ సెంటిమెంట్ వుంది. ఆయన స్క్రిప్ట్ రాయాలి అంటే ఛలో విశాఖ అంటారు. అక్కడి పార్క్ హోటల్ లో బస చేస్తారు. ఆయన ప్లస్ ఆయన టీమ్ కలిసి అక్కడ, లేదూ అంటే మధ్య మధ్యలో అరకులోయలో సిట్టింగ్ లు వేసి, స్క్రిప్ట్ తయారు చేస్తారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి విశాఖలోనే వున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత ఆయన ఎఫ్ 3 సినిమా చేయబోతున్నారు. వెంకటేష్-వరుణ్ తేజ్ లు నటించే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారు. మొదట్లో మహేష్ ను కూడా తీసుకోవాలనే ఆలోచన చేసారు. మహేష్ బాబుతో సూత్రప్రాయ చర్చలు కూడా సాగాయి. కానీ మళ్లీ ఎందుకనో అంతా మారిపోయింది.
ఎఫ్ 2 లో వున్న హీరోలు ఇద్దరే మళ్లీ ఎఫ్ 3 లో వుంటారు.ఈ మేరకు స్క్రిప్ట్ తయారు అవుతోంది. అనిల్ రావిపూడి ప్రశాంతగా విశాఖలో అదే పని మీద బిజీగా వున్నారు. వన్స్ స్క్రిప్ట్ రెడీ అయ్యే లోగా వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసి దీని మీదకు వస్తారు.