అవును నిజమే, ఆ హీరోయిన్ జీవితమే ఓ సినిమా కథ. చిన్న వయసులోనే జీవితానికి సరిపడే పోరాటం చేసింది. ఎక్కడో బ్రెజిల్లో పుట్టి పెరిగిన అమ్మాయి…ఇండియాకు వచ్చి, బాలీవుడ్‌లోనూ, టాలీవుడ్‌లోనూ సినిమా అవకాశాలు దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు. అందులోనూ పోర్చుగీస్ తప్ప మరే భాష తెలియని అమ్మాయి పరిస్థితి ఊహించుకుంటేనే “వామ్మో” అని అనకమానరు. వర్తమాన నటీనటులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ హీరోయిన్ ఇజాబెల్లే. బ్రెజిల్ దేశస్తురాలు.
బ్రెజిల్‌లోని పరైబా రాష్ట్ర రాజధాని జోం పెసావాలో పుట్టి పెరిగిన ఇజాబెల్లేకు లాయర్ కావాలనే కోరిక. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించలేదు. అంతేకాదు, పోలీసాఫీసర్ అయిన తండ్రి ఉద్యోగం పోవడంతో కుటుంబ పోషణ భారం కూడా మీద పడింది. ఫ్లస్ టూ చదువుకున్న ఇజాబెల్లే ఉపాధి కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకొంది. మోడలింగ్‌లో వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషించడంతో పాటు తన కలైన లాయర్ విద్యను పూర్తి చేసింది.
అయితే ఇండియాలో మోడలింగ్‌లో ఎక్కువ అవకాశాలు, సంపాదన ఉంటాయని ముంబయ్‌లో ఉన్న స్నేహితురాలి ద్వారా ఆమె తెలుసుకొంది. దీంతో చేతిలో పెద్దగా డబ్బు లేకుండానే ఆరు జతల దుస్తులతో ఓ శుభోదయాన ముంబయ్‌లో ఇజాబెల్లే అడుగు పెట్టింది.
ఇప్పుడు ఇండియాకు వచ్చి 8 సంవత్సరాలైంది. అయితే నమ్ముకున్న ఇండియా తనకే కోరుకున్నట్టుగానే సంపాదనతో పాటు అభిమానులను కూడా బాగా ఇచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. తన మాతృదేశమైన బ్రెజిల్‌లోనే ఉండిపోతే ఇంత మంది అభిమానాన్ని పొందేదాన్ని కాదేమో అని ఆమె తెలిపింది.
అయితే ఇండియాలో తన జీవన ప్రస్థానం సాఫీగా సాగలేదని చెప్పింది. ఎన్నో కష్టనష్టాలను ధైర్యంగా, స్థైర్యంతో ఎదుర్కొన్న తర్వాతే ఇప్పుడు ఓ స్థాయిలో నిలబడ్డానని ఆమె తెలిపింది. కేవలం మోడలింగ్ మీద మాత్రమే ఆధారపడలేదని, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని చెప్పారామె. అయితే తనకు పోర్చుగీసు తప్ప మరే ఇతర భాషలు రాకపోవడంతో అవకాశాలు దగ్గరికి వచ్చినట్టే వచ్చి…చివరి నిమిషంలో చేజారి పోయేవని వాపోయింది.
మరీ ముఖ్యంగా ఆడిషన్స్‌కి వెళితే వాళ్లు చెప్పేదేమీ అర్థం అయ్యేది కాదని, తనను ఏం అడుగుతున్నారో కూడా తెలియక నానా ఇబ్బంది పడాల్సి వచ్చేదంది. డైలాగులు చెప్పమంటే బిక్కముఖం వేసేదాన్నని పేర్కొంది. ఇలాగైతే వర్కవుట్ కాదనుకుని….డైలాగులను అక్కడ ప్రింట్ అవుట్ తీసుకుని రూంకొచ్చి నేర్చుకుని వెళ్లి చెప్పేదాన్నని బ్రెజిల్ యువతి చెప్పింది. కేవలం పదిహేను రోజుల్లో హిందీ, ఇంగ్లీష్ నేర్చుకుని అవకాశాలను మెరుగుపరచుకున్నట్టు ఇజాబెల్లే తెలిపింది.
కరీనాకపూర్ సినిమా తలాష్‌లో తనకు మొదటి ఛాన్స్ వచ్చిందని, అయితే తన పాత్రకు పెద్దగా డైలాగులు లేవని తెలిపింది. అయితే తానేమీ బాధపడలేదని, ఎందుకంటే డైలాగ్‌లు ఎక్కువగా లేకపోవడం వల్ల భాషా సమస్య పెద్ద అడ్డంకి కాలేదని తెలిపింది. ఆ సినిమాలో నటించడం వల్ల మరో రెండు సినిమా అవకాశాలు దక్కాయని తెలిపింది.
ఆ తర్వాత హీరోయిన్గా రెండు సినిమాల్లో అవకాశాలు రావడం, ఆ రెండు మంచి విజయం సాధించడంతో బాలీవుడ్లో నిలదొక్కుకున్నానని తెలిపింది. అదే సమయంలోనే పలు ఉత్పత్తులకు మోడలింగ్ చేసే అవకాశం వచ్చినట్టు ఆమె చెప్పింది.
తెలుగులో అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో అవకాశమొచ్చిందని చెప్పిందామె. అయితే ఆ సినిమాలో తన పాత్రకు డైలాగులు లేవని, దాంతో భాష ఇబ్బందిగా అనిపించలేదని చెప్పిందామె. ఆ సినిమా తర్వాత బాలీవుడ్లో కొన్ని సినిమాలు చేశానని చెప్పిందామె.
తాను బ్రెజిల్ వెళ్ళినప్పుడు ‘వరల్ట్ ఫేమస్ లవర్’లో ఓ పాత్ర కోసం క్రాంతి మాధవ్ తనకు ఫోన్ చేశాడని ఇజాబెల్లే చెప్పింది. తన సినిమాలో ఓ పాత్ర ఉంది చేస్తారా? అని అడిగారని, ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండతో చేయాలన్న తన కోరిక నెరవేరుతుందన్న ఆనందం మాటల్లో చెప్పలేనని ఆమె చెప్పింది. వెంటనే ఓకే చెప్పేసానని తెలిపింది. ఈ సినిమాలో పైలట్ పాత్ర చేసినట్టు ఆమె చెప్పింది. దీని కోసం ప్రత్యేకించి శిక్షణ తీసుకున్నానని, పట్టుపట్టి తెలుగు నేర్చుకుని ఈ సినిమాకు తనకు తానే డబ్బింగ్ చెప్పి ఆశ్చర్యపరిచింది.
మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉందని ఆమె అభిప్రాయపడింది. ఇక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు ఇజాబెల్లే తెలిపింది. చదువుకునేటప్పుడు ఓ వ్యక్తితో డేటింగ్లో ఉన్నానని, అభిప్రాయ భేదాలతో విడిపోయినట్టు ఆమె తెలిపింది. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్నానని ఇజాబెల్లే తెలిపింది.
మరో రెండు మూడేళ్ల వరకు పెళ్ళి చేసుకునే ఆలోచన లేదంది. ఇంత వరకూ తనను ఎవరూ ప్రపోజ్ కూడా చేయలేదని చెప్పింది. అయితే ప్రేమ పెళ్లి చేసుకోవాలని మాత్రం ఫిక్స్ అయినట్టు ఆమె తేల్చి చెప్పింది. నీతినిజాయితీ ఉన్నయువకుడిని పెళ్లాడాలనుకుంటున్నట్టు తెలిపింది.
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!