హీరోయిన్ స‌మంతను భ‌య‌పెట్టిన ఘ‌ట‌న అదే….

ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణి మారాలే త‌ప్ప త‌న డ్రెస్ సెన్స్‌లో మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మార్పు రాద‌ని అక్కినేని వారి కోడ‌లు, యంగ్ హీరో నాగ‌చైత‌న్య భార్య‌, ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత తేల్చి చెప్పారు.…

ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణి మారాలే త‌ప్ప త‌న డ్రెస్ సెన్స్‌లో మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మార్పు రాద‌ని అక్కినేని వారి కోడ‌లు, యంగ్ హీరో నాగ‌చైత‌న్య భార్య‌, ప్ర‌ముఖ హీరోయిన్ స‌మంత తేల్చి చెప్పారు. నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత కూడా స‌మంత మునుపటిలాగే సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్నారు. కేవ‌లం న‌ట‌న‌కు మాత్ర‌మే ఇంపార్టెన్స్ అని కాకుండా గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌ను కూడా చేస్తున్నారామె.

స‌మంత త‌న హాట్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో వీలున్న‌ప్పుడ‌ల్లా పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అయితే నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత మొద‌టిసారి కుర‌చ (పొట్టి) డ్రెస్‌లు వేసుకున్న‌ప్పుడు తానెలా ట్రోలింగ్ గురైందో సమంత తాజాగా చెప్పుకొచ్చింది.

`అదేంటో గానీ పెళ్లి త‌ర్వాత మొద‌టిసారి  నేను కురచ దుస్తులు వేసుకున్నప్పుడు నెటిజ‌న్ల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నా.  కొందరి కామెంట్స్ శృతి మించాయి. చాలా తీవ్ర పదజాలంతో విమర్శించారు. ప్చ్‌… చాలా కాలం అలాంటి నెగ‌టివ్ కామెంట్స్ నా మ‌న‌సును వెంటాడుతూనే ఉన్నాయి. చాలా కాలం మర్చిపోలేకపోయా. అయితే రెండోసారి అలాంటి ఫొటోలను పోస్ట్ చేసినపుడు ఆ స్థాయిలో ట్రోలింగ్ జరగలేదు. అలా అలా క్ర‌మంగా ట్రోలింగ్ త‌గ్గిపోయింది. నాక‌ప్పుడు అర్థ‌మైంది ఏంటంటే మనం మొదటి అడుగు వేసినపుడే కష్టంగా ఉంటుందని. ఫ‌స్ట్ టైం ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నప్పుడు చాలా భయపడ్డా. ప్రజల ఆలోచనా ధోరణి మారాలనుకున్నా. ఆ మార్పు మొదలవడానికి నేను ఎంత చేయగలనో అంతా చేయాలనుకున్నా` అని  సమంత చెప్పుకొచ్చింది.

నెటిజ‌న్లు వ్య‌తిరేకిస్తున్నార‌ని…త‌న‌కిష్ట‌మైన పొట్టి డ్రెస్‌ల‌ను ధ‌రించ‌డం మానేయ‌లేద‌ని స‌మంత అభిప్రాయం. అక్కినేని నాగార్జున కోడ‌లైన స‌మంత మొద‌టి సారి మాత్రం నెటిజ‌న్ల ట్రోలింగ్‌కు భ‌య‌ప‌డిన విష‌యం ఓపెన్‌గా చెప్పింది.

తను పక్కన ఉంటే అన్నీ మర్చిపోతా