ఈ రోజుల్లో టెక్నాలజీ మారిపోయింది. దొంగపనులు చేసేవాళ్లు చాలావరకు సీసీకెమెరాల బారిన పడి దొరికిపోతూ ఉన్నట్లే.. దొంగమాటలు వల్లించేవాళ్లు.. సాక్ష్యాధారాలు లేకుండా చెప్పే మాటలకు విలువ లేకుండా పోతోంది. పైపెచ్చు.. రాజకీయంగా చిలకపలుకులు పలకడం తప్ప.. తమ మాటలకు నిబద్ధత పరంగా ఏమాత్రం క్రెడిబిలిటీ లేని నాయకులు ఆరోపణలు గుప్పిస్తే అస్సలు ప్రజలు పట్టించుకోవడం లేదు. అవును- ఇదంతా మాచర్ల తగాదాలకు కారకులైన తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యానాల గురించి.
మాచర్లలో నామినేషన్ల సందర్భంగా.. విజయవాడ నుంచి పనిగట్టుకుని దందా చేయడానికి వెళ్లిన తెలుగుదేశం నాయకులపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. వారి వాహనాల అద్దాలు గట్రా ధ్వంసం అయ్యాయి. దరిమిలా.. అక్కడ దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తు అనేది జరగాలి కదా.. దాడికి గురైన వారు సదరు దర్యాప్తుకు వెళ్లి, పోలీసులకు సహకరించి.. అసలు నిందితులను నిగ్గుతేల్చే విషయంలో తోడ్పాటు అందించాలి కదా! అందుకే వారికి నోటీసులు పంపారు. ఇది కూడా తప్పే అన్నట్లుగా బోండా ఉమామహేశ్వరరావు తాజాగా పోలీసులను ఆడిపోసుకుంటున్నారు.
పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తులో భాగంగా బోండా ఉమా, బుద్ధా వెంకన్నలను పిలిస్తే దానిని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీరు విచారణకు వెళ్లకుండా కేసు దర్యాప్తు ఎలా సాగుతుందో అర్థం కావడం లేదు. అనామకులపై కేసులు పెట్టారంటూ కొత్త నిందలు వేస్తున్నారు.
కొత్తగా.. తమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులనుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ బోండా ఉమా కొత్త ఆరోపణ చేస్తున్నారు. బెదిరింపు కాల్స్ నిజమే అయితే గనుక.. ఆ కాల్ రికార్డింగులను బయటపెట్టవచ్చు కదా…? ఏ నెంబర్లనుంచి కాల్స్ వచ్చాయో.. పోలీసులకు ఆ వ్యవస్థ మీద నమ్మకం లేకపోతే ఎన్నికల సంఘం, న్యాయస్థానానికి ఫిర్యాదు చేయవచ్చు కదా! ఆ పనిమాత్రం చేయడం లేదు. కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కాల్ రికార్డింగు కు అడ్డంగా దొరికిపోయిన తర్వాత అయినా.. తెదేపా నాయకులు కాల్ రికార్డింగ్ టెక్నాలజీ గురించి అవగాహన తెచ్చుకుని.. తదనుగుణంగా వ్యవహరించడం జరగాలి. అయితే ఫోన్ బెదిరింపులు వస్తున్నాయని అనడమే తప్ప.. ఫిర్యాదు చేయడం, కాల్ రికార్డింగ్ చూపించకపోవడం గమనిస్తే.. అంతా కొత్త డ్రామా అనిపిస్తుంది. వాట్సప్ కాల్ వచ్చినా సరే.. కొందరికి రికార్డింగ్ కుదరకపోవచ్చు. కాని కాల్ డేటా సాక్ష్యాలతో నెంబర్ల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే ఉమా లాంటి వారి మాటల్ని జనం నమ్ముతారు. లేకుంటే ఇదో కొత్త ఎత్తుగడ అనుకుంటారు.
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!