అన్నీ కలిసొచ్చాయి.. ఈసారి ఏమౌతుందో చూడాలి?

సాధారణంగా సంక్రాంతి తర్వాత వెంటనే సినిమాలు విడుదల చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే సంక్రాంతి సినిమా హవా దాదాపు ఆ నెలంతా కొనసాగుతుంది కాబట్టి. అయితే ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ కు అంత సీన్…

సాధారణంగా సంక్రాంతి తర్వాత వెంటనే సినిమాలు విడుదల చేయడానికి ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే సంక్రాంతి సినిమా హవా దాదాపు ఆ నెలంతా కొనసాగుతుంది కాబట్టి. అయితే ఈసారి సంక్రాంతి బాక్సాఫీస్ కు అంత సీన్ లేదు. పేరుకు 4 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ బరిలో నిలిచింది ఒకే ఒక్క సినిమా. అదే ఇప్పుడు అఖిల్ కు అడ్వాంటేజ్ కాబోతోంది.

సంక్రాంతికొచ్చిన కథానాయకుడు సినిమా డిజాస్టర్ అయింది. వినయ విధేయరామ కూడా ఫ్లాప్ అయింది. పేట సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. ఎఫ్2 మాత్రమే హిట్ అయింది. కానీ దాని హవా మరోవారం మాత్రమే ఉంటుంది. సో.. థియేటర్లలో ఎఫ్2 మినహా మరో హిట్ లేదు. పైగా ఏదైనా పెద్ద సినిమా వస్తే దానికి థియేటర్లన్నీ కేటాయించడానికి అంతా రెడీగా ఉన్నారు.

సరిగ్గా ఇలాంటి టైమ్ లో రిలీజ్ కు రెడీ అయింది మిస్టర్ మజ్ను. మార్కెట్లో మరో పెద్ద సినిమా లేకపోవడం, బాలయ్య-చరణ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అఖిల్ సినిమాకు అత్యథిక స్థాయిలో థియేటర్లు దక్కబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ హీరో ఇప్పటివరకు 3 సినిమాలు తీస్తే.. మూడో సినిమాగా తెరకెక్కిన మిస్టర్ మజ్నునే ఇతడి కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్.

కేవలం భారీ రిలీజ్ మాత్రమేకాదు, ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మార్కెట్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమా హిట్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇలా అఖిల్ కు అన్నీ కలిసొచ్చాయి. మరి ఈ గ్యాప్ ను అఖిల్ భర్తీ చేయగలడా..? కెరీర్ లో తొలిసారిగా ఓ మంచి విజయాన్ని అందుకోగలడా..? చూడాలి.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

రామ్ చరణ్ స్టామినా ఇది..!