సైరాతో బన్నీ సినిమాకు ముడి

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ప్రకటన అధికారికంగా బయటకు వచ్చి ఇరవై రోజలు అయింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతూనే వుంది. ఫిబ్రవరిలో ముహుర్తం చేసి, మార్చి నుంచి షూట్ కు…

బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా ప్రకటన అధికారికంగా బయటకు వచ్చి ఇరవై రోజలు అయింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతూనే వుంది. ఫిబ్రవరిలో ముహుర్తం చేసి, మార్చి నుంచి షూట్ కు వెళ్లాలన్నది ప్లాన్. దాంతో విడుదల అక్టోబర్ లో వుంటుదని అంచనాలు వినిపించాయి.

కానీ విడుదల అన్నది అక్టోబర్ నా? జనవరినా? అన్నది ఇంకా యూనిట్ కు క్లారిటీలేదు. దీనికి కారణం మరేమీకాదు. మెగాస్టార్ మెగా సినిమా సైరా విడుదల ఎప్పుడు వుంటుంది అన్నది పక్కాగా తెలియకపోవడమే. దసరాకు రావడానికి ట్రయ్ చేస్తున్నాం అని నిర్మాత రామ్ చరణ్ చెప్పుకుంటూ వస్తున్నారు కానీ, పక్కగా వస్తున్నాం అని ప్రకటించలేదు.

అదే సమయంలో సైరా సంక్రాంతి 2020కి వస్తుందని, ఆ సినిమా బడ్జెట్ కు అదే సరైన డేట్ అని కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. మెగా సినిమా దసరాకు వస్తే బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఆ టైమ్ లో విడుదల కావడం జరగదు. సినిమా వర్క్ అయిపోయినా, అనివార్యంగా సంక్రాంతి కోసం మూతపెట్టి వుంచాలి. లేదూ సైరా సినిమా సంక్రాంతికి వెళ్తుందని పక్కాగా తెలిస్తే సమస్యేలేదు.

మేకింగ్ కు మహా అయితే ఆరేడు నెలలు ఎక్కువ. అందుకే పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని, ఫిబ్రవరిలో ముహుర్తం చేసుకుని, మార్చి నుంచి షెడ్యూలు వేసుకోవాలని బన్నీ-త్రివిక్రమ్ సినిమా యూనిట్ ప్రశాంతంగా వుండిపోయింది.

పవన్ ఒంటరిగా పోటీచేస్తే ఎవరికి లాభం?

రామ్ చరణ్ స్టామినా ఇది..!