వెంకటేష్‌తో యువ హీరోని జోడిస్తే అది బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయ్యే పవర్‌ఫుల్ కాంబినేషన్ అవుతుంది. 'మసాలా' చిత్రానికి ఆ కాంబినేషన్ బెడిసికొట్టినా కానీ 'ఎఫ్2'తో వెంకీ ఎంత ప్లస్ అనేది మరోసారి తెలిసింది. ముఖ్యంగా కామెడీ ప్రధాన పాత్రలు ఇస్తే వెంకటేష్ కబడ్డీ ఆడేసుకుంటాడు. ఎఫ్2 చిత్రాన్ని టోటల్‌గా డామినేట్ చేసేసి తన పర్‌ఫార్మెన్స్‌తో మరో రేంజ్‌కి తీసుకెళ్లాడు.
మిడిల్ రేంజ్ హీరోలతో వెంకటేష్‌ని కలిపితే మీడియం బడ్జెట్‌లోనే సినిమాలు పూర్తి చేసే వీలుంటుంది. వెంకీ వల్ల బాక్సాఫీస్ రీచ్ మాత్రం బాగా పెరుగుతుంది. అయితే వెంకటేష్‌ని పర్‌ఫెక్ట్ క్యారెక్టర్‌లో సరిగ్గా వాడుకోవడం తెలియాలి. అలా చేస్తే ఎఫ్2 మాదిరిగా బ్లాక్‌బస్టర్ కొట్టడం ఈజీ అయిపోతుంది. ఎఫ్2 విజయం నేపథ్యంలో వెంకటేష్, నాగచైతన్యతో ప్లానింగ్‌లో వున్న 'వెంకీ మామ' చిత్రానికి క్రేజ్ పెరిగింది.
అయితే ఆ చిత్రంలో వెంకటేష్ క్యారెక్టర్‌ని ఎఫ్ 2 తర్వాత రీ డిజైన్ చేస్తున్నారట. మరికాస్త ఇంపార్టెన్స్ పెంచి, వెంకటేష్ క్యారెక్టరైజేషన్‌లో ఫన్ ఫ్యాక్టర్ డోస్ ఎక్కువ చేస్తున్నారట. నాగచైతన్య ప్రస్తుతం డౌన్‌లో వున్నాడు కనుక వెంకటేష్‌కి ప్రాధాన్యత పెంచితే ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట.
వెంకటేష్ ప్రస్తుతానికి ఈ చిత్రం తప్ప మరేదీ కమిట్ కాలేదు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి దసరాకి విడుదలయ్యేలా చూస్తున్నారట.