బయోపిక్ పార్ట్ 2 వాయిదా?

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 మహానాయకుడు. ఈ సినిమాకు ముందుగా ఇచ్చిన డేట్ జనవరి 26. కానీ ఆ తరువాత ఫిబ్రవరి 7కు మార్చారు. అయితే ఇప్పుడు మళ్లీ డేట్ మారుతుందేమో అన్న అనుమానాలు…

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 మహానాయకుడు. ఈ సినిమాకు ముందుగా ఇచ్చిన డేట్ జనవరి 26. కానీ ఆ తరువాత ఫిబ్రవరి 7కు మార్చారు. అయితే ఇప్పుడు మళ్లీ డేట్ మారుతుందేమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. దీనికి కారణాలు కూడా వున్నాయి. రెండోభాగం షూట్ ఇంకా పదిరోజులకు పైగా బకాయి వుంది. ఆపైన ఫైనల్ ఎడిట్, రీరికార్డింగ్ వంటి వ్వవహారాలు వున్నాయి.

ఆ మధ్య నాలుగు రోజులు షూట్ చేసారు. మళ్లీ రేపటి నుంచో, ఆ మర్నాటి నుంచో షెడ్యూలు వేసారు. అంటే కనీసం నెలాఖరుకు కూడా షూట్ పార్ట్ పూర్తికాదు. అక్కడి నుంచి వారంరోజుల్లో ఫోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కావాలి. విడుదల ఏడోతేదీన అంటే కనీసం అయిదో తేదీకి అన్నీ పూర్తి అయి, కాపీ సిద్దంగా వుండాలి.

టోటల్ గా లెక్క వేసుకుంటే ఇరవై రోజులు సమయం వుంది. ఈ ఇరవై రోజుల్లో పదిరోజులు షూట్, ఆపైన మిగిలిన పనులు. అందుకే, ఓ వారం వెనక్కు వెళ్తుందేమో అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వెనక్కు వెళ్లే సమస్య లేదని, ఆ అవకాశం కూడా లేదని, ఎన్నికల కోడ్ వస్తే, సినిమాకు అడ్డం పడుతుందని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ 7న విడుదల చేయాల్సిందే అని కూడా అంటున్నారు.

సంగీత దర్శకుడు కీరవాణి తన వర్క్ మూడురోజుల్లో చేసి ఇస్తా అని, 30న కాపీ ఇచ్చినా తనకు చాలు అన్ని అన్నట్లు కూడా వినిపిస్తోంది. మరి దర్శకుడు క్రిష్ ఏం చేస్తారో చూడాలి.

కేసీఆర్, చంద్రబాబు ఫ్రంట్ గెలుపెవరిది? 

బాబు, జగన్ తేల్చాలేకపోతున్నారా..!