జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టిన యువ ఎంపీ

ఆడ‌లేక మ‌ద్దెల ద‌రువు అంటుంటారు. కానీ ఈ “మద్దిల” మాత్రం అభివృద్ధి ద‌రువు చేస్తోంది. తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి త‌న బాస్‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు. రాజ‌కీయాల‌తో…

ఆడ‌లేక మ‌ద్దెల ద‌రువు అంటుంటారు. కానీ ఈ “మద్దిల” మాత్రం అభివృద్ధి ద‌రువు చేస్తోంది. తిరుప‌తి ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి త‌న బాస్‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌లేదు. రాజ‌కీయాల‌తో ప్ర‌త్యక్ష సంబంధం లేని యువ ఫిజియోథెర‌ఫిస్ట్ ఏం చేస్తార‌బ్బా అని అంద‌రూ మొద‌ట్లో అసంతృప్తి వ్య‌క్తం చేసిన వాళ్లే. త‌న వ్య‌క్తిగ‌త ఫిజియోధెర‌ఫిస్ట్‌ను తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిల‌బెట్టిన‌ప్పుడు…. ఏదో అంద‌రిలో ఒక‌డ‌వుతాడ‌ని భావించారు.

కానీ క‌ల‌లో కూడా ఊహించ‌ని, చిన్న వ‌య‌సులో ద‌క్కిన అత్యున్న‌త ప‌ద‌వికి న్యాయం చేయాల‌నే త‌లంపు, ప‌ట్టుద‌ల డాక్ట‌ర్ గురుమూర్తిలో ఉన్నాయ‌నే సంగ‌తి….ఈ ఏడాదిలో ఆయ‌న ప‌నితీరే చెబుతుంది. ఎంపీగా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అలాగే ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు జ‌రుపుకుంటున్నారు. 1985 జూన్ 22న‌ శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వర్గం ప‌రిధిలోని మ‌న్న‌స‌ముద్రంలో ర‌మ‌ణ‌మ్మ‌-మునికృష్ణ‌య్య దంప‌తుల‌కు జ‌న్మించారు.

2021 లో తిరుప‌తి ఎంపీ బ‌ల్లి దుర్గాప్ర‌సాద్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆశీస్సుల‌తో తిరుప‌తి ఎంపీగా డాక్ట‌ర్ గురుమూర్తి 2021 మే 2న ఎన్నిక‌య్యారు. తిరుప‌తి లోక్‌స‌భ స‌భ్యుడిగా ఏడాది కాలంలో తాను చేసిన ప‌నుల‌పై గురుమూర్తి ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుద‌ల చేసి ఆద‌ర్శంగా నిలిచారు. గ‌డిచిన మూడు పార్లమెంట్ సమావేశాల్లో వివిధ అంశాలపై 61 ప్రశ్నలను కేంద్రానికి సంధించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ ప్ర‌శ్న‌లు వేసిన పిన్న‌వ‌య‌స్కుడిగా గురుమూర్తి గుర్తింపు పొందారు. పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు త‌ప్ప‌క హాజ‌ర‌వుతూ, ప్ర‌జాసమ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల వాణి వినిపిస్తూ జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త ఏడాదిలో ఎంపీగా ఏం చేశారంటే…

తిరుపతి ఎయిర్‌పోర్టులో MRO కేంద్రం ఏర్పాటుః

1500 కోట్ల రూపాయల పెట్టుబడితో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ కేంద్రాన్నినేలెకొల్పేందుకు టెండర్ల ప్ర‌క్రియ మొదలైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్వెస్ట్ ఇండియా సంస్థల‌తో గురుమూర్తి స‌మ‌న్వం వ‌ల్ల ఇది కార్య‌రూపం దాల్చ‌నుంది.

NBPPL మన్నవరం ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (SEZ)-

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ ప్ర‌తిష్టాత్మ‌క  మన్నవరం ప్రాజెక్ట్‌కు శంకుస్థాప‌న చేశారు. ఆ త‌ర్వాత వైఎస్సార్ ఆక‌స్మిక మ‌ర‌ణం, కేంద్రంలో అధికార మార్పిడితో మ‌న్న‌వ‌రం ప్రాజెక్టు మ‌రుగున ప‌డింది. మొద‌ట హెవీ ఎక్వీప్‌మెంట్ చేయాల‌నే స్టార్ట్ చేశారు. దానికి డిమాండ్ లేక‌పోవ‌డంతో ప్ర‌స్తుతం ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌గా మార్చారు. ఇదంతా  కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ త‌ర‌చూ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం వ‌ల్లే సాధ్య‌మైంది.  ఈ క్లస్టర్ లో సెమీ కండ‌క్టర్ తయారీ పరిశ్రమలతోపాటు అనేక అనుబంధ పరిశ్రమలను నెల‌కొల్పే  ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప‌రిశ్ర‌మ వ‌ల్ల వేలాది మందికి ఉపాధి అవ‌కాశాలు రానున్నాయి.

తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ బుకింగ్ టికెట్ కౌంటర్ః

ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో శ్రీవాణి ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కౌంటర్‌ ఏర్పాటుకు ఎంపీ చొర‌వ‌తో మార్గం సుగమమైంది. ఈ మేర‌కు టీటీడీ ఉత్త‌ర్వులు కూడా ఇచ్చింది. ఇక విమానాశ్ర‌యంలో కౌంట‌ర్ ఏర్పాటు చేయాల్సి వుంది.  

KRIBHCO ఎరువుల కర్మాగారంః

తిరుపతి జిల్లాలోని సర్వేపల్లి సమీపంలో బయో ఇథనాల్ ఇంధనం క్రిబ్కో  ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎంపీ చొర‌వ‌. ఇప్పటికే ఏపీఐఐసీ క్రిబ్‌కోకు 289.81 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో బయో ఇథనాల్ ప్రాజెక్ట్  ఏర్పాటుకు ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి.  

పులికాట్ సరస్సు, సముద్ర తీర మత్స్యకారుల సమస్యలు తీర్చే దిశగాః

పులికాట్ సరస్సులో నీటి మట్టాలను నిర్వహించడం, తద్వారా ఆ ప్రాంత మత్స్యకారుల జీవన విధానం మెరుగు పరిచేందుకు చ‌ర్య‌లు. 128.80 కోట్ల రూపాయల వ్యయంతో తిరుప‌తి జిల్లా రాయదురువు గ్రామంలో పులికాట్ సరస్సు సముద్ర ముఖద్వారం వద్ద పూడిక తొలగించేందుకు చ‌ర్య‌లు. కేంద్ర మ‌త్స్య‌శాఖ పెద్దల దృష్టికి స‌మ‌స్య‌ను ఎంపీ గురుమూర్తి తీసుకెళ్లారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ జాలర్ల మధ్య ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి శాశ్వత పరిష్కారం త్వరలో లభించనుంది.

ఎస్వీ యూనివర్సిటీ సమీపంలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తిః

ఐదేళ్ల క్రితం 152 కోట్ల రూపాయలతో ప్రారంభించిన రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యంపై ఎంపీ ఆగ్ర‌హం. త్వ‌ర‌గా పూర్తి చేసేలా ఎంపీ స‌ద‌రు కాంట్రాక్ట‌ర్ల‌ను వెంట‌ప‌డ్డారు. దీంతో ఐదేళ్లుగా ఆ ర‌హ‌దారిలో ప్ర‌యాణిల‌కు ఏర్ప‌డిన ఇబ్బందుల‌ను ఎంపీ తొల‌గించారు.  

అంబేద్కర్ నవోదయ స్కూల్ః

కేంద్ర‌ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపి అంబేద్క‌ర్ న‌వోద‌య స్కూల్‌ను మంజూరు చేయించ‌డంలో ఎంపీ విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం ఈ స్కూల్ కోసం స్థ‌లాన్ని కేటాయించాల్సి వుంది. స్థ‌ల ప‌రిశీల‌న కూడా పూర్త‌యింది. ఇది అందుబాటులోకి వ‌స్తే ఎంతో మంది విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందుతుంది.  

తిరుప‌తి ఆర్టీసీ బ‌స్టాండ్ః

తిరుప‌తి ఆర్టీసీ బస్టాండ్‌ను ఇంట‌ర్ మోడ‌ల్ స్టేష‌న్‌గా తీర్చిదిద్దేందుకు ఎంపీ గురుమూర్తి చొర‌వ క‌న‌బరిచారు. ఇందులో భాగంగా టెండ‌ర్ నోటీస్ కూడా వ‌చ్చింది. ఇది నేష‌న‌ల్ ప్రాజెక్ట్‌లో భాగం. ఇది తిరుప‌తి న‌గ‌రంలో మ‌రో మ‌ణిహారం కానుంది.