ఈమె టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందా?

సీతారామం సినిమాతో తళుక్కున మెరిసింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ, క్రేజీ మూవీస్ లో నటిస్తోంది. అంతా బాగానే…

సీతారామం సినిమాతో తళుక్కున మెరిసింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఓవర్ నైట్ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే ఊపును కొనసాగిస్తూ, క్రేజీ మూవీస్ లో నటిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ, ఆమె టాప్ హీరోయిన్ అవుతుందా అనే చర్చ మొదలైందిప్పుడు.

సీతారామంలో అద్భుతంగా నటించింది మృణాల్. ప్రస్తుతం చేస్తున్న హాయ్ నాన్న సినిమాలో కూడా యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా ఓ షేడ్ లో ఇల్లాలిగా కనిపిస్తోంది. ఇవన్నీ ఆమెలో నటనను వెలికితీసే పాత్రలే.

అయితే ఇలా కేవలం నటనకు మాత్రమే పరిమితమైతే టాప్ పొజిషన్ కు వెళ్లలేమనేది చాలామంది అభిప్రాయం. దీనికి వాళ్లు చెబుతున్న కారణాలు కూడా సహేతుకంగా ఉన్నాయి. పూజాహెగ్డే, సమంత, రష్మిక, నయనతార.. వీళ్లంతా టాప్ హీరోయిన్లు. అయితే కేవలం యాక్టింగ్ తో వీళ్లు టాప్ పొజిషన్ కు వెళ్లలేదు.

ముందుగా వీళ్లు గ్లామర్ రోల్స్ చేశారు. ఆ తర్వాతే నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఎంచుకున్నారు. గతంలో నయనతార, సమంత అదే చేశారు. ప్రస్తుతం రష్మిక కూడా అదే దారిలో వెళ్తోంది.

కానీ మృణాల్ మాత్రం రివర్స్ లో ఉంది. ఆమె నటించడానికి స్కోప్ ఉండే పాత్రల్ని మాత్రమే ఎంచుకుంటోంది. టాప్ పొజిషన్ కు చేరాలంటే ఇదొక్కటే చాలదు, గ్లామర్ డోస్ కూడా పెంచాలి. కమర్షియల్ హీరోయిన్ గా కూడా మెప్పించాలి. టాలీవుడ్ లో కొనసాగించాలంటే అది అత్యవసరం.

నిజానికి మృణాల్ కు గ్లామర్ రోల్స్ కొత్తకాదు. బాలీవుడ్ లో ఆమెకు గ్లామర్ డాల్ ఇమేజ్ ఉంది. ఎటొచ్చి టాలీవుడ్ లో మాత్రం అలాంటి పాత్రల్ని ఆమె సెలక్ట్ చేసుకోవడం లేదు.