బాలయ్య లీడ్ రోల్ పోషించిన ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా సెన్సార్ పూర్తయింది. ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్-యు ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అయితే ఈ సినిమా నిడివిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. అవును.. ఈ సినిమా ఏకంగా 170 నిమిషాలుంది. అది కూడా 'నో స్మోకింగ్' యాడ్స్ కాకుండా.
ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా నిడివిపై స్టార్టింగ్ నుంచి ప్రేక్షకుల్లో అనుమానాలున్నాయి. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ పోషించిన దాదాపు అన్ని పాత్రల్ని తను కూడా చేసేయాలనేది బాలయ్య పట్టుదల. ఆ కోరిక సినిమా రన్ టైమ్ పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని అంతా భావించారు. ఇప్పుడదే జరిగింది. ఏకంగా 2 గంటల 50 నిమిషాల సినిమా రెడీ అయింది.
అయితే సినిమా కాస్త పెద్దగా ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదని మేకర్స్ చెబుతున్నారు. సగటున 7 నిమిషాలకు ఒక గెటప్ తో బాలయ్య అలరిస్తారడని, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య వచ్చే సన్నివేశాలు విజువల్ ఫీస్ట్ లా ఉంటాయని చెబుతున్నారు.
ఇవన్నీ పక్కనపెడితే ఈమధ్య కాలంలో కాస్త లాంగ్ రన్ టైమ్ తో వచ్చిన రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి లాంటి సినిమాలన్నీ హిట్ అయ్యాయి. అలా చూసుకుంటే, బయోపిక్ కూడా హిట్ అవుతుందనే పాజిటివ్ సెంటిమెంట్ ను కూడా లేవనెత్తుతున్నారు కొంతమంది.
మరోవైపు టిక్కెట్లు రేట్లు కూడా పెంచడంతో.. బయోపిక్ కు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగానే వచ్చే అవకాశం ఉంది.