కేంద్రప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్‌తో విరుచుకుపడ్డారు. ఒకే ఒక్క వాక్యంతో కేంద్ర ప్రభుత్వానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారాయన. మిలటరీ ఉద్యోగాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘అగ్నిపథ్’ అనే స్కీమ్‌ను తెరపైకి తెచ్చింది. ఈ స్కీమ్ ఉద్యోగ భద్రత కల్పించదంటూ ఆర్మీ అభ్యర్థులు, నిరుద్యోగులు దేశ వ్యాప్తంగా నిరసనలకు దిగారు.
ఎక్కడికక్కడ రైళ్లను, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేస్తున్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి దిగారు. మోదీ సర్కార్ నిరుద్యోగ వ్యతిరేక విధానాలపై మంత్రి కేటీఆర్ తనదైన స్టైల్లో ట్విటర్ వేదికగా చెలరేగిపోయారు. నిరుద్యోగ సంక్షోభానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.
‘అగ్నివీర్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ – నో పెన్షన్ వరకు!’ అని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ ట్విటర్ వేదికగా దుమ్ము దులిపారు.
మొత్తానికి అగ్నిపథ్ స్కీమ్‌తో కేంద్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ప్రత్యర్థులకు భారీ ఆయుధాన్ని ఇచ్చినట్టైంది.