అంతిమ యాత్ర దిశగా కాంగ్రెస్

1960 దశకంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభం. కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటివారు ఒకవైపు. ఇందిరా, జగ్ జీవన్, వై బి చవాన్, సి సుబ్రహ్మణ్యం వంటివారు మరో వైపు. పార్టీ రెండుగా…

1960 దశకంలో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర సంక్షోభం. కామరాజ్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్ వంటివారు ఒకవైపు. ఇందిరా, జగ్ జీవన్, వై బి చవాన్, సి సుబ్రహ్మణ్యం వంటివారు మరో వైపు. పార్టీ రెండుగా చీలింది. దశాబ్ద కాలంలో పరిస్థితులు మారాయి. తర్వాత ఇందిరా గెలవడంతో మళ్ళీ ఇందిరను నాయకురాలిగా అంగీకరించారు.

1990 దశకంలో కాంగ్రెస్ పార్టీలో మరోసారి సంక్షోభం. సీనియర్ నేతలు తివారి నేతృత్వంలో పార్టీలో చీలిక. సోనియా నాయకత్వానికి సవాల్. శరద్ పవార్, మమతా బెనర్జీ వంటివారు సోనియా నాయకత్వాన్ని వ్యతిరేకించారు. దశాబ్ద కాలంలో పరిస్థితులు మారాయి. నాయకులు సోనియాగాంధీ నాయకత్వాన్ని అంగీకరించలేదు కానీ బయటనుండి బలపర్చారు. విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

2020 దశకంలో కాంగ్రెస్ పార్టీలో మరో సంక్షోభం. వయస్సు రీత్యా నాయకత్వం నుండి తప్పుకున్న సోనియా. పార్టీని నడిపించలేక తప్పుకున్న రాహుల్. వృద్ధ జంబూకల మధ్య నిలువలేక వెళ్లిపోతున్న యువతరం. సమర్ధవంతమైన నేత లేక చేతులెత్తేస్తున్న నాయకత్వం.

2040 దశకం…

(Facebook Post by Gopi Dara)