ఫొటోలకు ఎన్టీఆర్ దూరం.దూరం

ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ రోజే. ఫ్యాన్స్ కు తనను కలిసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ నోట్ వదిలారు. తాను ఇంట్లో లేకపోవడం వల్ల ఫ్యాన్స్ ను కలవలేకపోయాను అంటూ నోట్ లో…

ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ రోజే. ఫ్యాన్స్ కు తనను కలిసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ నోట్ వదిలారు. తాను ఇంట్లో లేకపోవడం వల్ల ఫ్యాన్స్ ను కలవలేకపోయాను అంటూ నోట్ లో వెల్లడించారు. 

ఇంతకీ ఇంట్లో లేకపోతే ఎన్టీఆర్ ఎక్కడకు వెళ్లినట్లు? ఎక్కడికీ వెళ్లలేదు. ఆయన గత కొన్ని రోజులుగా ఐటిసి కోహినూర్ లో అపార్ట్ మెంట్ తీసుకుని అందులోనే వుంటున్నారు.

తరువాత సినిమా కోసమే మేకోవర్ అవుతున్నారు. ఈ దశలో ఫొటోలు దిగడం ఇష్టం లేదు. ఫ్యాన్స్ ను కలిస్తే ఫొటోలు దిగాలి. సెలబ్రిటీలు అంతా ఐటిసి కోహినూర్ కే క్యూ కట్టారు. అక్కడే ఎన్టీఆర్ ను కలిసి అభినందనలు తెలిపారు. అప్పుడు కూడా నో ఫొటోస్ ప్లీజ్ అన్నదే.

ముందు రోజు రాత్రి అంటే గురువారం రాత్రి ఐటిసి కోహినూర్ లోనే ఎన్టీఆర్ తన సన్నిహితులు కొద్ది మందికి పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్ బర్త్ డే హడావుడి ముగిసింది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాల అప్ డేట్ లు వచ్చాయి. 

ఈ రెండూ పూర్తి అయ్యేసరికి 2023 పూరవుతుంది. ఆ తరువాత ప్రాజెక్టుల సంగతి అప్పుడు తెలుస్తుంది.