‘బయోపిక్’ భయపెడుతోంది

సాధారణంగా పండుగ సెలవులను క్యాష్ చేసుకోవాలని చాలా సినిమాలు చూస్తుంటాయి. అయితే పండగకు మహా అయితే రెండుమూడు సినిమాలకు మించి రాలేవు. అందుకే పండగకు రాలేని సినిమాలు ఆ తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి…

సాధారణంగా పండుగ సెలవులను క్యాష్ చేసుకోవాలని చాలా సినిమాలు చూస్తుంటాయి. అయితే పండగకు మహా అయితే రెండుమూడు సినిమాలకు మించి రాలేవు. అందుకే పండగకు రాలేని సినిమాలు ఆ తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి డేట్ వేసుకుంటాయి. ఏ ఏడాది అయినా జరిగేది ఇదే.

రాబోయే సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్, ఎఫ్ 2, వినయ విధేయ రామ సినిమాలు షెడ్యూలు అయ్యాయి. రజనీకాంత్ పేట్టా కూడా రావాల్సి వుంది. దీంతో అఖిల్ సినిమా మిస్టర్ మజ్ఞు, కళ్యాణ్ రామ్ సినిమా 118 జనవరి ఆఖరి వారానికి వెళ్లాయి. అలాగే నిఖిల్ ముద్ర కూడా ఆఖరివారంలో కానీ, ఆ పై వారంలో కానీ రావాలని అనుకుంది. ఇక కార్తీ దేవ్ కూడా ఇంచుమించు ఇదే టైమ్ లో ఫిక్స్ అయింది.

కానీ ఇలాంటి టైమ్ లో బయోపిక్ ఎలా వుంటుందో అన్న చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది. ఆ సినిమా హిట్ అయితే, కనీసం మూడువారాలు కుమ్ముతుంది. పైగా నెలరోజులు తిరగకుండా రెండోభాగం వస్తుంది. మొదటిభాగం హిట్ అయితే ఆ ఇంపాక్ట్ రెండోభాగం మీద వుంటుంది.

అంటే బయోపిక్ హిట్ అయితే జనవరి 9 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రభావం వుంటుంది. హిట్ కాకపోతే ఏ సమస్యాలేదు. అందుకే ఈసారి జనవరి ఆఖరివారంలో, ఫిబ్రవరి ఫస్ట్ ప్రాంతంలో డేట్ లు వేయాలనుకున్న సినిమాలు అన్నీ ఇప్పడు ఆలోచనలో పడ్డాయి. ఏ విషయం ఇదమిద్దంగా తేల్చి చెప్పలేకపోతున్నాయి.

అన్నీ రెడీ చేసుకుని, వెయిట్ అండ్ సీ మోడ్ లోకి వెళ్లి వుండిపోయాయి.

హంగ్ కోసం ప్రయత్నిస్తున్న జనసేన… పవన్ కింగ్ మేకర్ అవుతాడా?

AMB సినిమా హాల్స్ ప్లాన్స్ అంతా నమ్రతదే