టాలీవుడ్ హీరోల్లో ఫుల్ స్ట్రగులింగ్ హీరో ఎవరు అంటే రవితేజనే. సరైన హిట్ కోసం చూస్తున్నాడు ఇలాంటి టైమ్ లో టాగోర్ మధు-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో క్రాక్ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా టీజర్ వదిలి, డేట్ మే 8 అని ప్రకటించారొ, చకచకా బిజినెస్ క్లోజ్ అయిపోయింది.
ముఖ్యంగా నైజాం ఫ్యాన్సీ ప్రయిస్ రావడం విశేషం. వరంగల్ శ్రీను నైజాం ఏరియాకు 6.30 కోట్లకు క్రాక్ థియేటర్ హక్కులు తీసుకున్నారు. సీడెడ్ ను 3.33 కోట్లకు క్లోజ్ చేసారు. ఆంధ్ర ను ఎనిమిదిన్నర కోట్ల రేషియోలో క్లోజ్ చేయడం విశేషం.
వైజాగ్ వీరునాయుడు, ఈస్ట్ భరత్ చౌదరి, నెల్లూరు, వెస్ట్ ఉష పిక్చర్స్, గుంటూరు పవన్ కు హక్కులు విక్రయించేసారు. నాన్ థియేటర్ మాత్రం ఇంకా కాలేదు. అన్నీ కలిపి 20 కోట్ల వరకు రావాలని చూస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టు టాగూర్ మధుకు కాస్త డబ్బులు మిగిల్చేలా వుంది. రవితేజ-శృతి హాసన్ క్రేజీ కాంబినేషన్ లో మైనింగ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తయారవుతోంది.