అఖిల్ ఇంకా తెర మీదకి రాకముందే స్టార్ అని ఫిక్స్ అయిపోయారు. అందుకే మొదటి సినిమాకే విపరీతంగా ఖర్చు చేసి మరీ పరిచయం చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అవడంతో ఈసారి 'హలో' చెప్పించే బాధ్యతని నాగార్జునే తీసుకున్నారు. మళ్లీ ఓవర్ బడ్జెట్ అవడంతో 'హలో' కాస్ట్ ఫెయిల్యూర్ అయింది. ఈమధ్య అఖిల్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. మొదటి సినిమా ఫెయిలవడంతో రెండవ సినిమా కోసం చాలా కాలం ఎదురు చూసాడు.
రెండవదీ ఫ్లాప్ అయిన తర్వాత అయినా అఖిల్ స్పీడ్ పెంచలేదు. ఒకవైపు నాగ చైతన్య సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడిపేస్తున్నాడు. కానీ అఖిల్‌కి ఈ సంవత్సరంలో సినిమా లేదు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నపుడు పరాజయాలు ఒకటీ అరా వచ్చినా ఫరవాలేదు కానీ ఇంత గ్యాప్ తీసుకున్నపుడు హీరో గుర్తుండాలంటే ఖచ్చితంగా హిట్ ఇవ్వాల్సిందే.
అసలే యువ హీరోల్లో ఎప్పుడూ లేనన్ని ఆప్షన్స్ వున్నాయిపుడు. చాలా మంది యువ హీరోలకి మినిమం గ్యారెంటీ మార్కెట్ వుంది. ఈ టైమ్‌లో అఖిల్ స్లో అండ్ స్టడీ అంటూ కూర్చుంటే లాభం లేదు. జనవరిలో రిలీజ్ అయ్యే మిస్టర్ మజ్ను తర్వాత అయినా ఇంత గ్యాప్ రాకుండా జాగ్రత్త పడాలి. వచ్చే సంవత్సరం నుంచి అయినా ప్రతి ఇయర్ రెండు సినిమాలయినా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి.
భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా