ఇద్దరు స్టార్ హీరోలని కలిపి ఒక సినిమా చేయడమనేది చాలా కష్టమయినా రాజమౌళి బ్రాండింగ్ మీద ఎలాంటి కాంబినేషన్ సెట్ చేయడమైనా ఈజీయేనని 'ఆర్ఆర్ఆర్'తో రుజువయింది. అయితే ఇద్దరు అగ్ర హీరోలని కలపగలిగిన రాజమౌళికి వారికి సరిజోడీలని ఖాయం చేయడం మాత్రం సవాల్‌గా మారింది. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటోన్న హీరోయిన్ల కొరతకి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.
అనుష్క, సమంత తర్వాత మళ్లీ ఆ స్థాయిలో స్టార్డమ్ తెచ్చుకున్న హీరోయిన్ ఎవరూ లేరు. కొందరు హీరోయిన్లకి ఫాన్స్ ఏర్పడినా, కొందరు మంచి టాలెంట్ వున్నవారిగా పేరు తెచ్చుకున్నా కానీ సూపర్‌స్టార్ లేదా నంబర్‌వన్ అనిపించుకున్న హీరోయిన్స్ ఇప్పుడు లేరు. బాహుబలికి ప్రభాస్, రాణాలతో పాటు అనుష్కని రాజమౌళి వెంటనే ఓకే చేసేసాడు. కానీ ఇప్పుడు మాత్రం ఈ మల్టీస్టారర్‌కి తగ్గ హీరోయిన్ ఎవరని ఇంకా అన్వేషిస్తున్నాడు.
హీరోయిన్స్ గతంలో ఒక భాషకి పరిమితం అయ్యేవారు. ఒక చోట బాగా క్లిక్ అయితే కొంతకాలం పక్కచూపులు చూసే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఎటునుంచి ఛాన్స్ వస్తే అటు వెళ్లిపోతున్నారు. ఈ కారణంగానే ఎవరూ స్టార్స్‌గా ఎస్టాబ్లిష్ అవడం లేదు. దీంతో హీరోలకి కథలు ఓకే చేయడమయినా ఈజీగానే అవుతోంది కానీ హీరోయిన్ని ఫైనలైజ్ చేసుకోవడం మాత్రం టైమ్ తీసేసుకుంటోంది.
భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా