హరీష్ శంకర్ సినిమా చేసి ఏడాదిన్నర దాటిపోయింది. డిజె సినిమా తరువాత నుంచి సినిమా పట్టాలు ఎక్కించడానికి చేయని ప్రయత్నాలు లేవు. దిల్ రాజు అండగా వుంటారు అనుకుంటే, ఆయన తన సినిమాల్లో పడి, ఈయన్ను వదిలేసారు. సరే స్వంతగా, ఓ చిన్న సినిమా అని కొన్నాళ్లు గ్యాసిప్ లు వినిపించాయి.
ఆఖరికి తెలుగులో డబ్ అయిపోయిన తమిళ సినిమా జిగర్తాండ ను రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు. 14 రీల్స్ పతాకంపై ఈ సినిమా వుంటుందని, వరుణ్ తేజ్ ఒక హీరో అని పక్కా అయింది. అయితే ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే, ఈ సినిమా లేటవుతుందా? లేదా క్యాన్సిల్ అవుతుందా? అన్నది అనుమానంగా వుంది.
ఎందుకంటే వరుణ్ తేజ్ ఇప్పుడు ఫ్రీ అయిపోయినట్లే. అంతరిక్షం సినిమా పూర్తయింది. ఎఫ్ 2 కూడా దాదాపు పూర్తయింది. మరి వరుణ్ వెంటనే సినిమా స్టార్ట్ చేయాలంటే, హరీష్ శంకర్ స్క్రిప్ట్ రెడీగా లేదు. ఈ సంగతి వరుణ్ నే స్వయంగా చెప్పాడు.
జస్ట్ ఇలా అని లైన్ చెప్పారని, తమిళ సినిమా తెలుగులో అంటే చాలామార్పులు చేర్పులు అవసరం పడతాయని, హరీష్ ఆ పని పూర్తిచేయాలని వరుణ్ చెప్పారు. అయితే ఈ చెప్పడంలో మాత్రం అంత విశేషంగా, తొలిసారి విలన్ చేస్తున్నా అన్నంత ఉత్సాహంగా ఏమీ చెప్పలేదు.
ఏదో ఆయన ఓ లైన్ చెప్పారు, సరే, స్క్రిప్ట్ చేయమన్నా, చాలా చేయాలి అన్నట్లుగా వుంది ఆయన చెప్పిన స్టయిల్. అంటే కప్ టు లిప్ అన్నట్లు చాలా వుందనుకోవాల్సి వస్తోంది. ఈలోగా గీతా బ్యానర్ మీద అల్లు బాబి ప్రొడ్యూసర్ గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసే అవకాశమే ఎక్కువగా వుంది.
ఎందుకంటే ఆ స్క్రిప్ట్ రెడీగా వుంది కదా? అందువల్ల హరీష్ శంకర్ సినిమా వెంటనే స్టార్ట్ అవుతుందా? లేట్ అవుతుందా? అన్నది డౌటుగా వుంది.
డైరెక్టర్ హీరోను ఇంటర్వ్యూ చేస్తే… అది ఎంత ఫన్నీగా ఉంటుందో చూడండి
కేసీఆర్‌లా గెలిచినట్టుగా గెలుస్తారా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్