టాలీవుడ్ బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. ఒక్కొక్కటిగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఆమె చాలా బిజీ అయ్యారు.
ఆమెతో కలిసి నటించేందుకు మొదట భయపడినట్టు 'థ్యాంక్ యు బ్రదర్ ' ప్రధాన పాత్రధారి విరాజ్ అశ్విన్ చెప్పుకొచ్చారు. కరోనా దెబ్బతో ఈ నెల 7న ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదలైంది.
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఆయన తన అంతరంగాన్ని పంచుకున్నారు. తన పాత్ర గురించి మొట్ట మొదట చెప్పినప్పుడు నెగెటివ్ రోల్ అనిపించిందన్నారు.
కానీ డైరెక్టర్ రమేశ్ రాపత్తి తన పాత్ర గురించి చెప్పిన తీరు ఎంతో ఆకట్టుకుం దన్నారు. చాలా మంది ఫ్రెండ్స్ తనకు ఫోన్ చేసి చాలా బాగా చేశావని చెబుతుంటే ఎంతో ఆనందం కలిగిందన్నారు.
సినిమా చివర్లో క్లైమాక్స్‌లో తన నటన చూసి అమ్మ తనను హత్తుకుని ఏడ్చేసిందన్నారు. ఇది తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందన్నారు.
స్టార్ యాంకర్ అనసూయతో కలిసి నటించడానికి మొదట్లో భయమేసిందని అతను చెప్పుకొచ్చారు. అయితే షూటింగ్ స్పాట్‌లో అడుగు పెట్టాక ఆ భయం ఎగిరిపోయిందని తెలిపారు. అనసూయ అందరితో సరదాగా, కలివిడిగా ఉండడమే వల్ల భయం పోయిందని అతను చెప్పుకొచ్చారు.