పబ్లిసిటీ కోసమే నాపై దాడి చేశారు

గచ్చిబౌలిలోని ఓ క్లబ్ లో తనపై జరిగి దాడిపై బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ రియాక్ట్ అయ్యాడు. హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఓ ఎమ్మెల్యే తమ్ముడు తనను…

గచ్చిబౌలిలోని ఓ క్లబ్ లో తనపై జరిగి దాడిపై బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ రియాక్ట్ అయ్యాడు. హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్.. ఓ ఎమ్మెల్యే తమ్ముడు తనను కొట్టాడని ఆరోపించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్పష్టంచేశాడు.

“రాత్రి క్లబ్ లో నేను పార్టీ చేసుకుంటుంటే ఓ బ్యాచ్ ఎంటరైంది. అమ్మాయిల్ని కామెంట్ చేసుకుంటూ నా పక్కనుంచి డాష్ ఇచ్చుకుంటూ వెళ్లారు. నేను చేయి పట్టుకొని ఆపాను. వాడు నన్ను తోశారు. అక్కడితో ఆగలేదు వాళ్లు. నన్ను తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారని అడిగాను. అంతే, వాళ్లు డైరక్ట్ గా ఎటాక్ చేశారు. బీర్ బాటిల్ తీసుకొని కొట్టారు. దాదాపు 15 మంది ఉన్నారు వాళ్లంతా.”

తనపై దాడిచేసిన వాళ్లకు, తనకు గతంలో ఎలాంటి సంబంధం లేదంటున్నాడు రాహుల్. కేవలం పబ్లిసిటీ కోసమే వాళ్లు తనను కొట్టారని అంటున్నాడు. తనపై దాడిచేసింది కచ్చితంగా ఎమ్మెల్యే తమ్ముడేనని, తను దగ్గర సీసీటీవీ ఫూటేజ్ కూడా ఉందంటున్నాడు.

“రాకేష్ రెడ్డి అనే వ్యక్తి నా మీద దాడిచేశాడు. ఘటన జరిగిన వెంటనే నేను హాస్పిటల్ కు వెళ్లాను. ట్రీట్ మెంట్ తీసుకొని మళ్లీ వెంటనే క్లబ్ కు వచ్చాను. సీసీటీవీ ఫూటేజ్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నోళ్లు ఎన్నయినా చేస్తారు. అందుకే ఫూటేజ్ తీసుకున్నాను. పోలీస్ కంప్లయింట్ ఇచ్చాను.”

తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానంటున్నాడు రాహుల్. ఈ ఘటనకు భయపడి తను క్లబ్లులకు, పబ్బులకు వెళ్లడం మానుకోనని, తనపై ఎక్కడ దాడి జరిగిందో అదే క్లబ్ కు మళ్లీ మళ్లీ వెళ్తానంటున్నాడు.

ఈ విహారం పద్దతిని పాటిస్తే కరోనా సోకదు

ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తినండి