చిరంజీవి, మహేష్ ఛాటింగ్స్ బయటపెట్టిన నాగ్

నాగార్జున-మహేష్ వాట్సాప్ లో ఛాటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? చిరంజీవి-నాగార్జున మెసేజీలు పంపించుకుంటే ఎలా ఉంటుంది? కేవలం అతికొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. అయితే తాజాగా చిరంజీవి, మహేష్ తో తను…

నాగార్జున-మహేష్ వాట్సాప్ లో ఛాటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? చిరంజీవి-నాగార్జున మెసేజీలు పంపించుకుంటే ఎలా ఉంటుంది? కేవలం అతికొద్ది మందికి మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. అయితే తాజాగా చిరంజీవి, మహేష్ తో తను జరిపిన సంభాషణల్ని నాగార్జున బయటపెట్టాడు.

వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ట్రయిలర్ ను మహేష్ బాబు, చిరంజీవికి పంపించాడు నాగ్. ట్రయిలర్ చూసిన మహేష్ బాబు, చాలా బాగుందంటూ వాట్సాప్ లో రిప్లయ్ ఇచ్చాడు. అటు చిరంజీవి కూడా ట్రయిలర్ ను మెచ్చుకున్నాడు.

దీంతో వాళ్ల అనుమతితో, ఆ స్క్రీన్ షాట్స్ ను నాగార్జున బయటపెట్టాడు. రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు వైల్డ్ డాగ్ ట్రయిలర్ ను చిరంజీవి లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయంపై కూడా ఛాటింగ్ లో నాగ్-చిరు మాట్లాడుకున్నారు.

ఇలా స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేసి మరీ వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ ను కొత్త పుంతలు తొక్కించాడు నాగార్జున. మరోవైపు స్క్రీన్ షాట్ లో మహేష్ బాబు పెట్టుకున్న డీపీ చూసి అతడి ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. మహేష్ బాబు తన వాట్సాప్ డీపీగా సింహం ఫొటో పెట్టుకున్నాడు. అది కూడా ది లయన్ కింగ్ సినిమాలో స్టిల్ కావడం విశేషం.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. నాగ్ మరోసారి యాక్షన్ మోడ్ లోకి మారిపోయాడు. వైల్డ్ డాగ్ గా అతడి లుక్ బాగుంది. కాకపోతే ఓటీటీల్లో ఇలాంటి యాక్షన్ సిరీసుల్ని చాలా చూశారు జనం. థియేటర్లలో నాగ్ కొత్తగా ఏం చూపించబోతున్నాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

జోగి బ్రదర్స్ ..జాతి రత్నాలు రివ్యూ

శ్రీకారం మూవీ పబ్లిక్ టాక్