ఘనకీర్తి సాంద్ర, విజితాఖిలాంధ్ర.. జనతా సుధీంద్ర మణిదీపకా.. అంటూ సాగే ఏడున్నర నిమిషాల ఎన్టీఆర్ బయోపిక్ పాట వచ్చేసింది. ఎన్టీఆర్ గొప్పతనాన్ని, ఘనకీర్తిని భయంకరంగా పొగుడుతూ సాగే ఈ పాటను కీరవాణి తండ్రి శివదత్త రచించారు.
బహుశా టైటిల్ కార్ట్స్ వెనుక వస్తుందేమో? ఈ పాట రూపకల్పనలో కీరవాణి తన స్టయిల్ తో పాటు, కాస్తా పాత తరం ఇనుస్ట్రుమెంటేషన్ ను కూడా వాడారు. అదే సమయంలో దానవీరశూరకర్ణలో జయీభవ పాటను కూడా కాస్త దృష్టిలో పెట్టుకున్నట్లుంది.
కథానాయకా.. కథానాయకా అనే పదాలు మాత్రమే కామన్ ఆడియన్ కు పట్టేలా వున్నాయి.(ఇక్కడ మహానటీ.మహానటీ అన్నది గుర్తుకు వస్తుంది). మిగిలినవన్నీ ఒకటికి పదిసార్లు పదిలంగా వింటే తప్పపట్టేలా లేవు. నిజానికి దానవీరశూరకర్ణలో జయీభవ పాటలో పదాలు అన్నీ సంస్కృత సమాస భూయిష్టమైనా కూడా పెద్దగా హిట్ అయింది.
ఆ పదాలు అన్నీ క్లియర్ గా, స్పష్టంగా వుండేలా ఇనుస్ట్రుమెంటేషన్ సాగుతుంది. కానీ ఇక్కడ అలా లేదు. అయితే ఎన్టీఆర్ ఘనకీర్తిని, జీవిత విశేషాలను పొందుపరిచి, ఇవన్నీ వేయినోళ్ల పొగిడినట్లు వుండాలని ప్రయత్నం చేయడం వరకు బాగానే వుంది.
కానీ అందుకోసం లలితమైన పదాలను ఎంచుకుంటే బాగుండేది. మరీ గ్రాంధిక, శ్లిష్ట వ్యావహారిక పదాలు ఎంచుకోవడంతో, పాట పామలకు పడుతుందా అనే అనుమానం కలుగుతోంది.
తెలంగాణ ఓటరు నాడి… ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?… చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్