ఎన్టీఆర్.. పొలిటికల్ లుక్

ఇప్పటి వరకు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి సినిమాటిక్ లుక్ లు వదుల్తూ వచ్చిన నిర్మాణ యూనిట్, ఇప్పుడు తొలిసారి పొలిటికల్ లుక్ వదిలింది. తెల్లటి పంచెకట్టు, లాల్చీతో ఎన్టీఆర్  ట్రేడ్ మార్క్ నడకతో…

ఇప్పటి వరకు ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి సినిమాటిక్ లుక్ లు వదుల్తూ వచ్చిన నిర్మాణ యూనిట్, ఇప్పుడు తొలిసారి పొలిటికల్ లుక్ వదిలింది. తెల్లటి పంచెకట్టు, లాల్చీతో ఎన్టీఆర్  ట్రేడ్ మార్క్ నడకతో వెళ్తున్న సీన్ ను హీరో బాలకృష్ణతో రెప్లికా చేసినట్లు వుంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కొద్దిరోజులు మాత్రమే ఈ గెటప్ లో వున్నారు.

చైతన్య రథంపై ఖాకీ డ్రెస్ తో, పదవిలోకి వచ్చాక వివేకానందుడి గెటప్ లో వున్నారు. పార్టీ పెట్టినపుడు కొదిద రోజులుమాత్రమే ఇలా కనిపించారు. ఈ స్టిల్,సీన్ చూస్తుంటే, సినిమాలో ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ వెళ్లి, మూడో వరుసలో తనకు సీటు కేటాయించడం చూసి, అవమానంతో అక్కడి నుంచి చకచకా నడుచుకుంటూ వెళ్లిపోయే సీన్ లో స్టిల్ అని అనుమానం కలుగుతోంది.

ఎన్టీఆర్ చకచకా వెళ్లిపోతుంటే, పంక్షన్ కు వచ్చిన వారు ఆయనకు జేజేలు పలుకుతారని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ నెల 25నే ఈ స్టిల్ ను కొన్ని గ్రూపుల్లో వేసేయడం విశేషం. ఏ ఊరిలోనో తెలియదు కానీ, ఈ స్టిల్ ను భారీగా ఫ్లెక్సీలు కూడా కట్టేసారు.