టైమ్‌ వేస్ట్‌ చేసుకుంటోన్న బన్నీ

తనకి పోటీదారులైన ఇద్దరు హీరోలు రెండేళ్ల వరకు ఒకే సినిమాకి కమిట్‌ అయిపోయారు. ఈ సమయంలో తాను వేగం పెంచి ఎక్కువ సినిమాలు చేయాల్సింది పోయి అల్లు అర్జున్‌ ఖాళీగా కూర్చుంటున్నాడు. రాజమౌళి చిత్రానికి…

తనకి పోటీదారులైన ఇద్దరు హీరోలు రెండేళ్ల వరకు ఒకే సినిమాకి కమిట్‌ అయిపోయారు. ఈ సమయంలో తాను వేగం పెంచి ఎక్కువ సినిమాలు చేయాల్సింది పోయి అల్లు అర్జున్‌ ఖాళీగా కూర్చుంటున్నాడు. రాజమౌళి చిత్రానికి ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ పూర్తి సమయం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ టైమ్‌ని అల్లు అర్జున్‌ అనుకూలంగా మార్చుకోకుండా సెల్ఫ్‌ డౌట్స్‌తో కాలయాపన చేస్తున్నాడు.

నా పేరు సూర్య తర్వాత ఎన్నో కథలు విన్న అల్లు అర్జున్‌ దేనినీ ఓకే చేయలేదు. త్రివిక్రమ్‌ ఖాళీ అయితే సినిమా చేద్దామని అరవింద సమేత రిలీజైన వెంటనే త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్‌ చేసాడు. అయితే ఇంతవరకు దీనికి కూడా కథ ఓకే కాలేదు. ముందుగా ఓ రీమేక్‌ చేద్దామనుకుని, తర్వాత మనసు మార్చుకున్నాడు.

మరోవైపు తన ఇమేజ్‌కి సూట్‌ కాని 96 రీమేక్‌ని తనకి అనుగుణంగా మార్చమని ఆ సినిమా రైట్స్‌ తీసుకున్న దిల్‌ రాజుని, తమిళ వెర్షన్‌ తీసిన దర్శకుడు ప్రేమ్‌ కుమార్‌ని అడుగుతున్నాడని టాక్‌ వినిపిస్తోంది. అసలు బన్నీ ఇంత కన్‌ఫ్యూజన్‌లో ఎందుకు పడ్డట్టు? సరైనోడు సక్సెస్‌ అవడంతో మాస్‌ హీరోగా సెటిల్‌ అవ్వాలని చూసి డిజె, నా పేరు సూర్య చేసిన అల్లు అర్జున్‌ తన కోర్‌ ఆడియన్స్‌ అయిన ఫ్యామిలీస్‌ని డిజప్పాయింట్‌ చేసాడు.

ఈలోగా ఇతర హీరోలు వెరైటీ కథలకి ప్రాధాన్యత ఇస్తూ వుండడంతో తాను కూడా వైవిధ్యం కావాలంటూ విక్రమ్‌ కుమార్‌తో చాలా టైమ్‌ స్పెండ్‌ చేసినా ఫైనల్‌గా రిస్క్‌ చేయలేక త్రివిక్రమ్‌ వైపుకి మొగ్గాడు. ఒక స్టార్‌ హీరో ఇలా కన్‌ఫ్యూజన్‌లో ఖాళీగా వుండడం అటు అభిమానులనే కాక ఇటు తెలుగు సినిమా మార్కెట్‌ని కూడా ఇబ్బంది పెడుతోంది.