సెన్సారు దగ్గర చిక్కుకున్న భైరవగీత

ఆర్జీవీ తెగ హడావుడి చేస్తున్న భైరవగీత సినిమా ఇప్పుడు సెన్సారులో చిక్కుకుంది. దాంతో ఈనెల 30న రావడంలేదు. 500 కోట్ల సినిమాకు అయిదు కోట్ల సినిమా పోటీ అంటూ చేసిన హంగామా ఆగిపోయింది. సినిమాను…

ఆర్జీవీ తెగ హడావుడి చేస్తున్న భైరవగీత సినిమా ఇప్పుడు సెన్సారులో చిక్కుకుంది. దాంతో ఈనెల 30న రావడంలేదు. 500 కోట్ల సినిమాకు అయిదు కోట్ల సినిమా పోటీ అంటూ చేసిన హంగామా ఆగిపోయింది. సినిమాను ఏడున విడుదల చేయబోతున్నట్లు, రామ్ గోపాల్ వర్మనే స్వయంగా ట్వీట్ చేసారు.

విషయం ఏమిటంటే, ఈ సినిమాను కన్నడ, తెలుగు భాషల్లో తీసారు. డబ్బింగ్ మాదిరిగా కాకుండా స్ట్రయిట్ గానే తీసామని మేకర్లు అంటున్నారు. అయితే మెయిన్ నిర్మాత కన్నడ నిర్మాణ రంగంలో వున్నారు కాబట్టి, అక్కడ సెన్సారుకు అప్లయ్ చేసారు. కానీ తెలుగు వెర్షన్ చూడడం అక్కడ కుదరదని హైదరాబాద్ కు రిఫర్ చేసారు.

ఇక్కడ ఒక్కరోజులో చూసే పరిస్థితి లేదు. పైగా భైరవగీతం నిండా వయిలెన్స్, రొమాన్స్ విచ్చలవిడిగా వున్నట్లు ఇప్పటివరకు విడుదల చేసిన ప్రోమోలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల సెన్సారు హడావుడిగా జరిగేది కాదు. కట్ లు, మ్యూట్ లు తప్పనిసరి.

దీంతో 30కి విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. అందుకే 7కు వాయిదా అని ప్రకటించేసారు. కానీ ఏడున కూడా బాగా సినిమాలు వున్నాయి. సుబ్రహ్మణ్యపురం, హుషారు, కవచం, ఇంకా మరి కొన్ని సినిమాలు ఇప్పటికి షెడ్యూలు అయి వున్నాయి. అందువల్ల ఏవి వస్తాయో? ఏవి 14కు వెళ్తాయో చూడాలి.

కల్యాణ్ రామ్ ఇంతకీ ఎటువైపు..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్