క‌రోనా ఎఫెక్ట్.. హీరోయిన్ ఫారెన్ టూర్ ర‌ద్దు!

కాస్త త‌గ్గుముఖం ప‌డుతోంద‌నుకున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ పంజా విసురుతున్న‌ట్టుగా ఉంది. చైనాను దాటి క‌రోనా వైర‌స్ వివిధ దేశాల్లో వార్త‌ల్లోకి ఎక్కుతోంది. ఒక‌వైపు తూర్పు ఆసియా దేశాలు క‌రోనా భ‌యాందోళ‌న‌ల‌తో ఉన్నాయి. ద‌క్షిణాసియాలోనూ…

కాస్త త‌గ్గుముఖం ప‌డుతోంద‌నుకున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ పంజా విసురుతున్న‌ట్టుగా ఉంది. చైనాను దాటి క‌రోనా వైర‌స్ వివిధ దేశాల్లో వార్త‌ల్లోకి ఎక్కుతోంది. ఒక‌వైపు తూర్పు ఆసియా దేశాలు క‌రోనా భ‌యాందోళ‌న‌ల‌తో ఉన్నాయి. ద‌క్షిణాసియాలోనూ క‌రోనా వార్త‌లు క‌నిపిస్తూ ఉన్నాయి. మ‌రోవైపు ప‌శ్చిమాసియాలో అనేక కేసులు న‌మోదు అయ్యాయి. ఇంకోవైపు యూర‌ప్ లో ప్రాన్స్ లో క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి.

ఇండియాకు వ‌చ్చిన ఒక‌రిద్ద‌రు ఫ్రాన్స్ టూరిస్టుల్లో కూడా క‌రోనా వైర‌స్ గుర్తించార‌ట‌. మ‌రోవైపు పారిస్ లో క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య పెరుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. సోమ‌వారానికి అక్క‌డ 191 మందికి క‌రోనా ఇన్ ఫెక్ట్ అయ్యింద‌ని తేలింద‌ట‌. ఈ నేప‌థ్యంలో పారిస్ భ‌య‌పెట్టేస్తూ ఉంది. పారిస్ అంట‌నే టూరిజానికి కేరాఫ్. క‌ల‌ర్ ఫుల్ లైఫ్. అనునిత్యం ప్ర‌పంచం న‌లుమూల‌ల నుంచి పారిస్ ను చూడ‌టానికి ఎంతో మంది వ‌చ్చి వెళ్తూ ఉంటారు. దీంతో అక్క‌డ క‌రోనా ప్ర‌భావం ఏర్ప‌డి ఉండ‌వ‌చ్చు.

ఈ ప‌రిస్థితుల్లో పారిస్ వెళ్ల‌డానికి ప్ర‌ముఖులు కూడా త‌ట‌పటాయిస్తున్న‌ట్టుగా ఉన్నారు. పారిస్ టూర్ ను ర‌ద్దు చేసుకుని వార్త‌ల్లోకి వ‌చ్చింది న‌టి దీపికా ప‌దుకునే. అక్క‌డ ఒక ఫ్యాష‌న్ వీక్ లో పాల్గొన‌డానికి దీపిక వెళ్లాల్సి ఉంద‌ట‌. అయితే క‌రోనా అక్క‌డ వ్యాపిస్తున్న వార్త‌ల నేప‌థ్యంలో… దీపిక ఆ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

అన్నయ్య గురుంచి ఎవడైనా బ్యాడ్ గా మాట్లాడితే చంపేస్తా

కేసీఆర్ ఆదేశించారు మా ప్రయత్నం మేము చేస్తున్నాం