టీడీపీలో హరిలోరంగ హరీ ?

అక్కడ అందరూ పెద్ద‌వాళ్ళే, అందరూ నీతులు చెప్పేవారే. సమయానికి మాత్రం బాబు పక్కన నిలబడి హాజరీ వేయించుకునే తీరిక, ఓపికా మాత్రం ఎవరికీ లేవు. నీతులు చెప్పమంటే చాటభారతాలే చెబుతారు. వీళ్ళనేనా చంద్రబాబు నమ్ముకున్నది…

అక్కడ అందరూ పెద్ద‌వాళ్ళే, అందరూ నీతులు చెప్పేవారే. సమయానికి మాత్రం బాబు పక్కన నిలబడి హాజరీ వేయించుకునే తీరిక, ఓపికా మాత్రం ఎవరికీ లేవు. నీతులు చెప్పమంటే చాటభారతాలే చెబుతారు. వీళ్ళనేనా చంద్రబాబు నమ్ముకున్నది అనిపించకమానదేమో.

బాబు విశాఖ ఎయిర్ పోర్టులో అయిదారు గంటలపాటు గో బ్యాక్ అవమానాలూ, అష్టదిగ్బంధనాలతో నానా అవస్థలూ పడుతూంటే తమ్ముళ్ళు మాత్రం ఎవరి బిజీలో వారున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు కనీసం అధినేత వచ్చాడన్న సంగతి తెలిసినా ఆ వైపు వెళ్ళకపోతే మరోకాయన ప్రవచనకారుడి అవతారం ఎత్తేసి టీవీల్లో శాంతి వచనాలు చెబుతాడు.

దీని మీద వైసీపీ నేత కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ, సెటిల్మెంట్లు చేసే టీడీపీ నాయకులు కూడా నీతులు చెబుతున్నారని, శాంతి అంటున్నారని ఎకసెక్కం ఆడారు. మాజీ ఎంపీ సబ్బం హరి బాబుని గో బ్యాక్ అనడం మంచిది కాదంటూ టీవీల ముందు స్తోత్రపాఠాలు వల్లెవేస్తున్నారని, నిజానికి ఆయన ఆ రోజు బాబు పక్కక ఉండకుండా ఎందుకు గాయబ్ అయ్యారో చెప్పాలని నిలదీశారు.

టీడీపీలో ఉన్న వారే బాబును ఆదరించలేదని, దగ్గరకు వెళ్ళలేదన్న వైసీపీ నేతలు విశాఖ ప్రజలు గో బ్యాక్ అనకుండా ఘనస్వాగతం ఎందుకు పలుకుతారని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద టీడీపీలోనే బాబు టూర్ కి స్పందన లేదని అర్ధమవుతోంది.

బాబు కంటే పెద్ద బాబులం అనుకునే వారు ఉన్న ఉత్తరాంధ్ర టీడీపీలో బాబు ఎపుడు విశాఖ వచ్చినా ఇదే జరుగుద్దీ అని బల్లగుద్ది మరీ  వైసీపీ నేతలు చెప్పేస్తున్నారు. టీడీపీ నేతలు ఎదురు విమర్శలు మాని సొంత పార్టీని చక్కదిద్దుకోవాలని కూడా ఉచిత సలహా ఇస్తున్నారు.

ఈ ప్లానెట్ లోనే మోస్ట్ హంబుల్ పర్సన్

నాన్ను బే అంటావా.. అవును అంటాను బే ..