మొన్నటివరకు బొద్దుగా బబ్లీగా కనిపించిన కీర్తిసురేష్ ఒక్కసారిగా బక్కపల్చగా మారిపోయింది. ఆమె సన్నటి ఫిజిక్ చూసి ఆశ్చర్యపడని ప్రేక్షకుడు లేడు. ప్రస్తుతం అదే స్లిమ్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది కీర్తిసురేష్. ముఖంలో కళ తగ్గినా ఫిజిక్ విషయంలో మాత్రం ఆమె రాజీపడడం లేదు. ఇప్పుడిదే బాటలో క్యాథరీన్ కూడా చేరిపోయింది.
క్యాథరీన్ కూడా బొద్దుగా, ముద్దుగా ఉండేది. బన్నీ నటించిన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో క్యాథరీన్ బుగ్గలు చూసి అంతా బాగున్నాయనుకున్నారు. దాదాపు నిన్నమొన్నటివరకు అదే ఫిజిక్ మెయింటైన్ చేసిన క్యాథరీన్ ఇప్పుడు సెడన్ గా స్లిమ్ అయిపోయింది. తాజాగా క్యాథరీన్ చేసిన స్టిల్స్ చూసి అవాక్కవ్వడం ఆడియన్స్ వంతయింది.
అవును.. న్యూలుక్ లో క్యాథరీన్ అందరికీ షాకిచ్చింది. కీర్తిసురేష్ ఎలాగైతే విమర్శలు ఎదుర్కొంటోందో.. సేమ్ టు సేమ్ అలాంటి సెటైర్లే క్యాథరీన్ మీద పడుతున్నాయి. ఒకప్పటి ఆమె బూరెబుగ్గలు మాయమయ్యాయి. చూడ్డానికి చీపురు పుల్లలా తయారైంది. రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేసింది క్యాథరీన్. అందులో లుక్ తో పోలిస్తే మరింత సన్నగా మారిపోయింది.
ప్రస్తుతం ఆమెకు మంచి సినిమాలు పడడం లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత మళ్లీ మరో మూవీ పడలేదు. దీంతో అవకాశాల కోసం ఆమె ఇలా స్లిమ్ గా మారింది. కానీ ముఖంలో కళ తగ్గి మొదటికే మోసం వచ్చేలా తయారైంది.