లై, శ్రీనివాస కళ్యాణం సినిమాలు నిరాశ పరిచాయి హీరో నితిన్ ను. ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు డిస్కషన్ లో వుంటే, వాటిల్లో రెండు ప్రాజెక్టులు రెడీ టు సెట్ అంటున్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ అనే ప్రాజెక్టు ఒకటి. రష్మీ మడోన్నా హీరోయిన్. గీతా2 బ్యానర్ మీద బన్నీ వాస్ నిర్మించే సినిమా ఇంకోటి. దీనికి సుకుమార్ అసిస్టెంట్ ప్రతాప్ (కుమారి 21ఎఫ్) దర్శకుడు.
ఈ రెండు సినిమాలు బౌండ్ స్క్రిప్ట్ తో రెడీ ఫర్ షూట్ అన్నట్లు వున్నాయి. అయితే వీటిల్లో ఏది ముందు స్టార్ట్ అవుతుందన్నదే ప్రశ్న. డిసెంబర్ నుంచి తమ సినిమా స్టార్ట్ చేస్తామని భీష్మ యూనిట్ చెబుతోంది. కానీ ఆ సూచనలు కనిపించడం లేదు.
ఇదిలా వుంటే ఆ సినిమాతో సంబంధం లేకుండా, తమ సినిమాను జనవరి నుంచి స్టార్ట్ చేసేయాలని గీతా 2 సంస్థ ప్రయత్నాలు ప్రారంభించేసినట్లు బోగట్టా. మరి నితిన్ డేట్ లు ముందు ఎవరికి ఇస్తాడో? లేదా సమాంతరంగా చేస్తాడో చూడాలి. ఏదయినా సరే, హిట్ కొట్టాల్సిందే. లేదూ అంటే ఇప్పటికే లైన్ లోంచి పక్కకు వెళ్లిపోయాడు నితిన్.
బిడ్డా రాస్కో.. తెలంగాణలో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్