హీరో డబుల్ రోల్.. ఇద్దరు మెయిన్ హీరోయిన్లు, మరో అదనపు హీరోయిన్. ఇదీ రాబోయే రవితేజ సినిమా వ్యవహారం. విఐ ఆనంద్ దర్శకుడు. మరి బడ్జెట్ ఎలా వుంటుంది. హీరో రెమ్యూనిరేషన్ వదిలేసినా, పాతికకోట్ల వరకు తప్పదు. కానీ రవితేజ సక్సెస్ ఫుల్ గా వరుస డిజాస్టర్లు ఇస్తూ వస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ మీద ప్రభావం ఎలాగూ వుంటుంది. అందుకే నిర్మాత ఇప్పుడు బడ్జెట్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హీరో రెమ్యూనిరేషన్ కాకుండా సినిమాను 15 నుంచి 20 కోట్ల లోపులో ఫినిష్ చేయమని డైరక్టర్ ను అడుగుతున్నట్లు వినిపిస్తోంది.
కానీ దర్శకుడు విఐ ఆనంద్ ఇందుకు ఇబ్బంది పడుతున్నట్లు బోగట్టా. సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్ కావడంతో కాస్త గ్రాఫిక్స్ వర్క్ కూడా వుంటుంది. అన్నీకలిపి 20లోపు సినిమా మేకింగ్ అంటే ఎలా అని ఆయన కిందామీదా అవుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి అమర్ అక్బర్ ఆంటోని కాంబినేషన్ వల్ల నాన్ థియేటర్ రైట్స్ డబ్బులు వచ్చి, గట్టెక్కారు. కానీ చిన్న బ్యానర్, మీడియం డైరక్టర్ కావడం, పైగా ఫ్లాపుల తరువాత రావడం బిజినెస్ సమస్య వుంటుంది. అందుకే నిర్మాత సినిమా మొత్తానికి అన్నీకలిపి 30లోపు ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నట్లుంది.
బిడ్డా రాస్కో.. తెలంగాణలో అధికారం మాదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్