తాప్సీతో న‌టించేది లేద‌న్న ఆ హీరోలెవ‌ర‌బ్బా!

హీరోయిన్ తాప్సి పేరు చెప్ప‌గానే కుర్ర‌కారు గుండ్ ఝ‌ల్లుమంటుంది. అందానికి త‌గ్గ అభిన‌యం ఆమె సొంతం. అలాంటి హీరోయిన్‌తో న‌టించేది లేద‌ని కొంద‌రు హీరోలు చెప్పారంటే భ‌లే ఆశ్చ‌ర్యం క‌దూ. కానీ ఇది నిజం.…

హీరోయిన్ తాప్సి పేరు చెప్ప‌గానే కుర్ర‌కారు గుండ్ ఝ‌ల్లుమంటుంది. అందానికి త‌గ్గ అభిన‌యం ఆమె సొంతం. అలాంటి హీరోయిన్‌తో న‌టించేది లేద‌ని కొంద‌రు హీరోలు చెప్పారంటే భ‌లే ఆశ్చ‌ర్యం క‌దూ. కానీ ఇది నిజం.

‘నాతో క‌ల‌సి న‌టించేందుకు కొంద‌రు హీరోలు ఒప్పుకోలేదు’ అని క‌థానాయిక తాప్సి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇంత‌కూ ఆ హీరోలెవ‌ర‌బ్బా అనే ప్ర‌శ్న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

తాప్సి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన  ‘థ‌ప్ప‌డ్’ చిత్రం ఇటీవ‌ల విడుద‌లైంది. ఈ సినిమాలో దేశ వ్యాప్తంగా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఎలాంటి అంచ‌నాలు లేకుండానే విడుద‌లైన సినిమా ఊహించిన దానికంటే ఎక్కువ హిట్ టాక్ రావ‌డంతో చిత్ర యూనిట్ ఆనందానికి అవ‌ధుల్లేవు. ఈ సినిమాలో తాప్సి మ‌గ‌వాళ్ల‌కి క‌నువిప్పే క‌లిగించే పాత్ర‌లో సూప‌ర్బ్ అనిపించుకున్నారు.

సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఆమె ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. మొట్ట మొద‌ట ద‌క్షిణాది నుంచి త‌న సినీ ప్ర‌స్థానం ప్రారంభ‌మైన‌ట్టు చెప్పారు. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో మంచి బ్రేక్ అందుకున్న‌ట్టు ఆమె వివ‌రించారు. అలాగే కొంత మంది హీరోల మ‌న‌స్త‌త్వంలో మార్పు రావాల‌ని కూడా తాప్సి హిత‌వు ప‌లికారు.

‘కొంద‌రు హీరోలు నాతో క‌ల‌సి న‌టించేందుకు కూడా అంగీక‌రించ‌లేదు. ఎందుకంటే నాతో క‌ల‌సి న‌టిస్తే, అంద‌రి దృష్టి వారిపై కంటే కూడా నాపైనే ప‌డుతుంద‌ని, వారిని ఎవ‌రూ ప‌ట్టించుకోర‌నే అభ‌ద్ర‌త‌. ఆ భ‌యంతోనే నాతో క‌లసి న‌టించేందుకు ముందుకు రాలేదు. అలా భ‌య‌ప‌డిన హీరోల్లో కేవ‌లం ఒక‌ట్రెండు సినిమాలు చేసిన వాళ్లు కూడా ఉన్నారంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. హీరోయిన్ల ప్రాధాన్యం ఉన్న సినిమాల‌కు త‌క్కువ బ‌డ్జెట్‌తో స‌రిపెట్ట‌వ‌చ్చు. ఒక హీరోకి ఇచ్చే పారితోషికంతో మొత్తం సినిమానే తీయ‌వ‌చ్చు. ఇంకా చెప్పాలంటే, అంత కూడా ఖ‌ర్చు కాక‌పోవ‌చ్చు. హీరోయిన్లు ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టించిన‌ప్పుడు మాత్ర‌మే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మార్పు వ‌స్తుంది’ అని తాప్సి మ‌న‌సులో మాట‌ను ధైర్యంగా చెప్పారు.

కానీ త‌న‌తో న‌టించ‌మ‌ని చెప్పిన హీరోలెవ‌రనే విష‌యాన్ని మాత్రం ఆమె చెప్ప‌లేదు. బ‌హుశా ఆ అవ‌స‌రం లేద‌నుకొని ఉండొచ్చు. కేవ‌లం సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ల‌పై హీరోల వివ‌క్ష‌ను తెలియ‌జేసేందుకు మాత్ర‌మే ఆమె త‌న అనుభ‌వాన్ని పంచుకున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

బయట వాళ్ళు చూసి పిచ్చోడు వీడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి అనేవాళ్లు