కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కొన్ని దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్లో సెకెండ్ వేవ్ ఉధృతితో మిగిలిన దేశాలు అప్రమత్తమయ్యాయి.
భారత్కు కొన్ని దేశాలు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యం లో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలకమైన కఠిన నిర్ణయం తీసుకోవడం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో పాటు ఆలోచింపజేస్తోంది. అలాగే కరోనా తీవ్రత ఎంతగా భయపెడుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
భారత్ నుంచి స్వదేశానికి వచ్చే పౌరులకు ఇటీవల ఆస్ట్రేలియా సమయం ఇచ్చింది. గడువు లోపు రాని వారు ఇక మీదట రావ ద్దని తమ పౌరులపై ఆస్ట్రేలియా నిషేధం విధించింది. ఒకవేళ ఎవరైనా నిషేధ నిబంధనలు అతిక్రమించి భారత్తో 14 రోజుల పాటు ఉన్న తమ దేశ పౌరులు ఎవరైనా ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెడితే ఐదేళ్ల జైలు శిక్ష లేదా 66 వేల డాలర్లు (రూ.49 లక్షలు) జరిమానా విధించనున్నారు.
ఈ కఠిన నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. బయో సెక్యూరిటీ చట్టం కింద తీసుకొచ్చిన ఈ సరికొత్త నిబంధనల నుంచి ఐపీఎల్లో ఆడు తున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు, శిక్షణ సిబ్బందికి మినహాయింపు ఇచ్చే యోచ నలో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం దేశ చరిత్రలోనే ఇదే ప్రపథమని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటిం చింది.
భారత్లో తమ పౌరులు 9 వేల మంది నివసిస్తున్నారని, వారిలో కనీసం 600 మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం అంచనా వేస్తోంది.