దీపికా, రణ్ వీర్ సింగ్ ల పెళ్లి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతోంది. ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి రకారకాల వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లి ఏర్పాట్లు వాటికి అవుతున్న ఖర్చు.. అన్నీ కూడా మీడియాకు వార్తలుగా నిలుస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రియాంక పెళ్లి కబుర్లు.. మరోవైపు దీపికా, రణ్ వీర్ ల పెళ్లి ముచ్చట్లు.. ఇలా బాలీవుడ్ కే పెళ్లిసందడి వచ్చింది.
ఇక వీరి పెళ్లికి ఆహ్వానితులు కూడా అంతా బిగ్ షాట్సే ఉంటారని చెప్పనక్కర్లేదు. అటు రణ్ వీర్ కు అయినా ఇటు దీపికకు అయినా క్రేజ్ కు అయితే కొదవలేదు. సినిమా, క్రికెట్, వ్యాపార రంగాల్లోని ప్రముఖులు వీళ్లకు అత్యంత సన్నిహితులు. వారిని వీళ్లు తమ పెళ్లికి ఆహ్వానించే అవకాశాలున్నాయి.
మరి ఇదే సమయంలో.. వీళ్ల పెళ్లి వేడుకకు మాజీ ప్రేమికులు హాజరవుతారా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. రణ్ వీర్ కు దీపికతో ముందు ఉన్న లవ్ స్టోరీలు చిన్నచిన్నవే. కానీ దీపికకు మాత్రం బిగ్ షాట్స్ తోనే ప్రేమకథలున్నాయి.
దీపిక మాజీ ప్రియుల జాబితాలో విజయ్ మాల్యా తనయుడు సిద్ధార్థ్ మాల్యా, బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ వంటి వాళ్లున్నారు. వీళ్లు మాత్రమే గాక.. దీపిక లవ్ స్టోరీలు మరింత మందితో ఉన్నాయి. సినిమాల్లో స్టార్ కాకముందే దీపికకు ప్రేమకథలున్నాయి. వాటికీ కొంత ప్రచారం ఉంది.
మరి తమ మాజీ ప్రేమికులను ఈ హీరోహీరోయిన్లు తమ పెళ్లికి ఆహ్వానించగలరా? ప్రత్యేకించి రణ్ బీర్ కపూర్ ఈ పెళ్లికి హాజరవుతాడా? ఈ వేడుకను చూసి తట్టుకోగలడా? లేక తన తాజా ప్రేయసి అలియా భట్ తో కలిసి పెళ్లికి వస్తాడా?
టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్