మహేష్ బాబు-రాజమౌళి-కేఎల్ నారాయణ సినిమా ఎప్పటి నుంచో లైన్ లో వుంది. దీని కోసం రాజమౌళి అనుకున్న క్యారెక్టర్ కూడా ఒకటి వుంది. అదే జేమ్స్ బాండ్ లేదా సీక్రెట్ ఏజెంట్ టైపు పాత్ర.
ఈ జోనర్ లో ఇఫ్పటి వరకు రాజమౌళి సినిమా కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఈ పాత్రతో రాజమౌళి సినిమా చేసే అవకాశం లేకపోవచ్చు.
ఎందుకుంటే మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేయబోయే సినిమాలో హీరో పాత్ర ఇలాంటిదే అని తెలుస్తోంది. సీక్రెట్ ఏజెంట్ గా మహేష్ బాబు క్యారెక్టర్ ను త్రివిక్రమ్ డిజైన్ చేసారని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
నిజానికి ఈ లైన్ ను ఎన్టీఆర్ కు కూడా జస్ట్ క్యాజువల్ గా త్రివిక్రమ్ వినిపించినట్లు, బాగుంది డెవలప్ చేయమని ఎన్టీఆర్ అన్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు అదే లైన్ తో మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే, పాపం, రాజమౌళి మళ్లీ కొత్త స్క్రిప్ట్ వెదుక్కోవాలి మహేష్ కోసం.