అమరావతి మీద క్లారిటీ ఇచ్చేశారుగా…?

అమరావతి రాజధానిగా ఉండాలంటూ తాజాగా పంచ శత దినోత్సవ వేడుకలు జరిపించారు. ఇలా లెక్కబెట్టుకుంటూ వెళ్తే వేయి రోజులైనా జరిగిపోతాయని మంత్రి బొత్స సత్యనారాయణ దీని మీద గట్టిగానే సెటైర్ వేశారు. Advertisement మేము…

అమరావతి రాజధానిగా ఉండాలంటూ తాజాగా పంచ శత దినోత్సవ వేడుకలు జరిపించారు. ఇలా లెక్కబెట్టుకుంటూ వెళ్తే వేయి రోజులైనా జరిగిపోతాయని మంత్రి బొత్స సత్యనారాయణ దీని మీద గట్టిగానే సెటైర్ వేశారు.

మేము అన్ని ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం, అందులో అమరావతి రాజధాని కూడా ఉంది. అమరావతిని మేమేం కాదనడంలేదే అంటున్నారు బొత్స.

అక్కడ అభివృద్ధికి పూర్తిగా అడ్డుపడుతున్నది చంద్రబాబేనని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. కోర్టులకు వెళ్ళి అభివృద్ధిని జరగనీయకుండా చేస్తున్నది బాబేనని ఆయన కౌంటరేశారు.

అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా అజెండాగా ఉంటే చంద్రబాబు మాత్రం ఒకే ప్రాంతాన్ని పట్టుకుని చివరికి తన మీద  కుల ముద్ర కూడా వేయించుకున్నారు అంటున్నారు బొత్స.

అమరావతి ప్రగతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని కూడా ఆయన చెబుతున్నారు. ఎవరేమి అనుకున్నా కూడా తాము పదమూడు జిల్లాలను అభివృద్ధి చేస్తామని, అందులో అమరావతి కూడా ఉందని బొత్స పక్కాగా క్లారిటీ ఇచ్చేశారు.