పునర్జన్మల కథతో నాని

టాక్సీవాలా సినిమాతో హిట్ కొట్టాడు డైరక్టర్ రాహుల్. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సైంటిఫిక్ ఫాంటసీతో ఆ సినిమాను తయారుచేసిన రాహుల్ ఓ టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో ఇన్నాళ్లు మలి సినిమా కోసం…

టాక్సీవాలా సినిమాతో హిట్ కొట్టాడు డైరక్టర్ రాహుల్. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో సైంటిఫిక్ ఫాంటసీతో ఆ సినిమాను తయారుచేసిన రాహుల్ ఓ టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో ఇన్నాళ్లు మలి సినిమా కోసం ప్రయత్నాలు చేసాడు. కానీ దాన్ని ఎవ్వరూ ఓకె అనలేదు. అలాంటిది ఇప్పుడు నాని తో సినిమా ప్రకటన వచ్చింది. 

మరి దాని సబ్జెక్ట్ ఏమై వుంటుంది? టైమ్ మెషీన్ కాన్సెప్ట్ నా? మరోటా? విశ్వసనీయ వర్గాల ప్రకారం ఓ కొత్త సబ్జెక్ట్ తో రాహుల్ హీరో నానిని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ లో రెండు ప్రేమకథలు వుంటాయని తెలుస్తోంది. ఒకటి హైదరాబాద్ బ్యాక్ డ్రాప్, మరోటి కలకత్తా బ్యాక్ డ్రాప్.

ఈ రెండు కథలకు పునర్జన్మల లింక్ వుంటుందని తెలుస్తోంది. అంటే పునర్జన్మల కాన్సెప్ట్ తో నానిని సినిమాకు ఒప్పించేసాడన్నమాట. తెలుగు సినిమాకు పునర్జన్మల కాన్సెప్ట్ అనేది సక్సెస్ ఫుల్ ఫార్ములా. మరి ఇంతకీ నాని సినిమాలో రెండు కథల్లో కనిపిస్తాడు అంటే డబుల్ రోల్ అనుకోవాలా? లేక మరే విధంగా వుంటుందో, చూడాల్సిందే.