మారుతికి అంత చాన్స్ దొరుకుతుందా?

ఉన్నట్లుండి టాలీవుడ్ లో ఒక వార్త గుప్పుమంది. హీరో బన్నీకి డైరక్టర్ మారుతి ఓ కథ చెప్పారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పారు. బన్నీకి బాగా నచ్చింది. విదేశీ టూర్ కు ఫ్యామిలీతో వెళ్లిన…

ఉన్నట్లుండి టాలీవుడ్ లో ఒక వార్త గుప్పుమంది. హీరో బన్నీకి డైరక్టర్ మారుతి ఓ కథ చెప్పారు. ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పారు. బన్నీకి బాగా నచ్చింది. విదేశీ టూర్ కు ఫ్యామిలీతో వెళ్లిన మారుతి తిరిగి రాగానే మిగిలిన హాఫ్ కూడా చెబుతారు. ఆ సినిమా గీతాఆర్ట్స్ పతాకంపై వుంటుంది. ఇదీ ఆ వార్త సారాశం.

మారుతి గీతా బ్యానర్ కు సినిమా చేయాల్సి వుంది. అది పక్కా. సరైన సబ్జెక్ట్ వుంటే సినిమా చేద్దామనే ఆఫర్ బన్నీ దగ్గర నుంచి వుంది అది కూడా పక్కా. కానీ ఇప్పుడు ఈ టైమ్ లో మారుతి డైరక్షన్ లో బన్నీ సినిమా చేస్తాడా? అన్నదే అనుమానం

మారుతి ఇప్పటి వరకు రెండు కమర్షియల్ సినిమాలు ట్రయ్ చేసారు. బాబు బంగారం, శైలజారెడ్డి అల్లుడు. రెండూ సరైన ఫలితాలు ఇవ్వలేదు. అసలే బన్నీ ఫ్లాపుల్లో వున్నాడు. డైరక్టర్ దొరక్క, సబ్జెక్ట్ దొరక్క కిందా మీదా అవుతున్నాడు. 

మరోపక్క త్రివిక్రమ్ తో సినిమా పక్కా అని వినిపిస్తోంది. నిర్మాత ఎవరో తేలితే ఆ ప్రాజెక్టు ప్రకటన బయటకు వస్తుంది. మరోపక్క విక్రమ్ కుమార్ అలా వుండనే వున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మారుతి సినిమా నెంబర్ ఎంత అన్నది అనుమానం. మరి ఈ ఫీలర్ ఎందుకు? ఎలా బయటకు వచ్చినట్లు?

అయినా ష్యూర్ షాట్ హిట్ అన్న నమ్మకం దొరికే వరకు సెట్ మీదకు వెళ్లకుండా ఇంట్లో కూర్చున్న బన్నీ ఇప్పడు మారుతితో ప్రయోగం చేస్తారా? అన్నది అనుమానమే.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి