ఎన్టీఆర్ బయోపిక్-అసలు స్క్రిప్ట్ వేరు

ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఇప్పటి వరకు వదుల్తున్న విశేషాలను ఆలంబనగా చేసుకుని, అభిమానులు, సినిమా జనాలు ఓ అంచనాకు వచ్చారు. కానీ అసలు స్క్రిప్ట్ వేరు అని తెలుస్తోంది. ఇప్పటిదాకా వినవచ్చిన వార్తలు ఏమిటంటే…

ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఇప్పటి వరకు వదుల్తున్న విశేషాలను ఆలంబనగా చేసుకుని, అభిమానులు, సినిమా జనాలు ఓ అంచనాకు వచ్చారు. కానీ అసలు స్క్రిప్ట్ వేరు అని తెలుస్తోంది. ఇప్పటిదాకా వినవచ్చిన వార్తలు ఏమిటంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం దగ్గర ఫస్ట్ పార్ట్ కు ఫుల్ స్టాప్ పెడతారన్నది. కానీ వాస్తవం అది కాదని వినిపిస్తోంది లేటెస్ట్ గా.

బయోపిక్ ఫస్ట్ పార్ట్ కీలకంగా డ్రామానే వుంటుదని, ఇప్పుడు యూనిట్ హడావుడి చేస్తున్న సినిమా నటులు, పాటలు, సీన్ల అన్నీ కలిపి గట్టిగా అరగంట మాత్రమే వుంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ యవ్వనం, కష్టపడడం, పైకిరావడం, పెళ్లి, భార్య బసవతారకంతో అనుబంధం, హరికృష్ణ,చంద్రబాబు పాత్రలు ఇవీ కీలకంగా వుంటాయని తెలుస్తోంది.

సినిమాలో ఎన్టీఆర్ గా బాలయ్య పాత్ర తరువాత కీలకంగా వుండేవి విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్ పాత్రలే అని, చాలా సినిమా వీళ్ల చుట్టూ వుంటదని తెలుస్తోంది. సినిమా పాత్రలు, పాటలు అన్నీ అలా అలా లైట్ గా టచ్ చేస్తారని వినికిడి. సినిమాలో బాలకృష్ణగా బాలయ్య పాత్ర పెద్దగా వుండదని తెలుస్తోంది.

రెండోభాగంలో దివిసీమ ఉప్పెన
సినిమా రెండో భాగంలోనే రాజకీయం, దివిసీమ ఉప్పెన వంటి వ్యవహారాలు వుంటాయని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు అవమానం జరగడం, రాజకీయ రంగంలోకి వెళ్లాలని డిసైడ్ కావడం అన్నీ ఈ రెండో భాగంలోనే అని కొత్తగా వినిపిస్తోంది. కావాలనే క్రిష్ అండ్ కో సినిమాకు బజ్ తీసుకురావడానికి అన్నీ సినిమాటిక్ స్టిల్స్, వార్తలు వదుల్తున్నట్లు తెలుస్తోంది.

కానీ వాస్తవానికి సినిమా ఫస్ట్ పార్ట్ నిండా ఎమోషన్లు, డ్రామా ఎక్కువగా వుంటుందని వినిపిస్తోంది. దివిసీమ ఉప్పెన పార్ట్ వచ్చినపుడు మండలి వెంకట కృష్ణారావు పాత్ర వుంటుందని, ఆ పాత్ర కోసం ఇప్పటి ఆయన వారసుడు మండలి బుద్ద ప్రసాద్ ను నటింపచేస్తున్నారని కూడా తెలుస్తోంది.