కనీసం జపాన్ అయినా ఆదుకుంటాడా..?

కార్తి హీరోగా నటించిన సినిమా జపాన్. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కార్తి కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం. అందుకే ఈ సినిమాపై చాలా కేర్ తీసుకున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.…

కార్తి హీరోగా నటించిన సినిమా జపాన్. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కార్తి కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం. అందుకే ఈ సినిమాపై చాలా కేర్ తీసుకున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే అంతకంటే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్.

ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు అడుగంటాయి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి సైడ్ అయి కోలీవుడ్ కు షిఫ్ట్ అయిన ఈ హీరోయిన్, రేపోమాపో అట్నుంచి అటు మల్లూవుడ్ కు మారాలని అనుకుంటోంది. జపాన్ సినిమా హిట్టయితే ఆమెకు తమిళ్ నుంచి మరికొన్ని అవకాశాలొస్తాయి. లేదంటే అనుకున్న టైమ్ కంటే ముందే ఆమె కేరళకు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది.

కెరీర్ లో హిట్స్ కంటే, ఫ్లాపులే ఎక్కువగా చవిచూసింది అను ఎమ్మాన్యుయేల్. ఏడేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ, సరైన క్రేజ్ అందుకోలేకపోయింది. నాని సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి, గోపీచంద్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్, నాగచైతన్య లాంటి హీరోలతో సినిమాలు చేసినప్పటికీ ఆమెకు పెద్దగా కలిసొచ్చిందేం లేదు.

తెలుగులో రవితేజ సరసన ఆమె చేసిన రావణాసుర సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. ప్రస్తుతం జపాన్ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. కనీసం జపాన్ అయినా ఈ హీరోయిన్ కు హిట్టిస్తే బాగుణ్ను.