మళ్లీ షూటింగ్ లు బంద్?

మళ్లీ మరోసారి షూటింగ్ లు బంద్ దిశగా టాలీవుడ్ పయనిస్తోందా? టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు వాస్తవమైతే ఈ నెల మూడో వారం నుంచి షూటింగ్ లు నిలిపివేసే అవకాశం వుంది. రోజు రోజుకూ…

మళ్లీ మరోసారి షూటింగ్ లు బంద్ దిశగా టాలీవుడ్ పయనిస్తోందా? టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు వాస్తవమైతే ఈ నెల మూడో వారం నుంచి షూటింగ్ లు నిలిపివేసే అవకాశం వుంది. రోజు రోజుకూ కరోనా విస్తృతరూపం దాల్చుతోంది. 

ఇప్పటికే ఆంధ్రలో యాభై శాతం థియేటర్ ఆక్యుపెన్సీ ప్రకటించారు. నేడో, రేపో తెలంగాణలో కూడా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని మేజర్ ప్రొడక్షన్ హవుస్ లు షూటింగ్ లు నిలిపివేసాయి. 

చాలా మంది హీరోలు, కొందరు హీరోయిన్లు షూటింగ్ లు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దాంతో వాళ్లతో సంబంధలేని వర్క్ లు కొందరు చేసుకుంటున్నారు. మొత్తం మీద షూటింగ్ లు చాలా తక్కువ గా జరుగుతున్నాయి. ప్రతి యూనిట్ లోనూ కరోనా ఎఫెక్ట్ కనిపిస్తోంది. 

ఇలాంటి నేపథ్యంలో అఫీషియల్ గానే ఈ నెల మూడో వారం నుంచి షూటింగ్ లు నిలిపివేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికిప్పుడు సినిమాలు రెడీ చేసినా విడుదల చేసే పరిస్థితి లేదు. వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నందున కరోనా కేసులు తగ్గుముఖం పట్టేవరకు వేచి చూడాల్సింది.

మెగాస్టార్ సారథ్యంలోని సిసిసి సినిమా రంగంలోని అందరికీ వ్యాక్సినేషన్ చేయించే దిశగా ప్రణాళికలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చే ఆదేశాలు, కరోనా కేసుల సంఖ్య ను చూసి, నిర్ణయం తీసుకోవాలని వేచి వున్నారు. బహుశా మూడో వారం వచ్చేసరికి ఇక షూటింగ్ లు వుండవు అని వార్తలు వినిపిస్తున్నాయి.