కరోనా మహమ్మారి ఏ ఒక్కర్నీ విడిచిపెట్టేలా లేదు. గత ఏడాది వచ్చిన కరోనా మహమ్మారి …ఎట్టకేలకు అంతరించిపోతోందిలే అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి విజృంభిస్తోంది. మొదటిసారి కంటే మరింత ఉధృతంగా కరోనా సెకండ్ వేవ్ దూసుకొస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా పొలిటికల్ సెలబ్రిటీలు కరోనాబారిన పడ్డారన్న సమాచారంతో సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లకు కరోనా పాజిటివ్ అని తేలింది.
కేసీఆర్‌కు స్వల్ప కరోనా లక్షణాలున్నట్టు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు.
ఇటీవల నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నోముల భగత్ కూడా కరోనాబారిన పడ్డట్టు తెలిసింది.
మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను చికిత్స నిమిత్తం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. వయోభారంతో బాధపడుతున్న మన్మోహన్సింగ్ కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఆయన కరోనా వ్యాక్సిన్ కూడా తీసుకోవడంతో త్వరగా కోలుకుంటారని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.