మారుతి సినిమా ఆగింది

2019 డిసెంబర్ తరువాత మళ్లీ దర్శకుడు మారుతి సినిమా రాలేదు. కరోనా సమస్య, హీరోలు దొరక్క ఇలా చాలా అంటే చాలా. ఆఖరికి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా స్టార్ట్ అయింది. Advertisement…

2019 డిసెంబర్ తరువాత మళ్లీ దర్శకుడు మారుతి సినిమా రాలేదు. కరోనా సమస్య, హీరోలు దొరక్క ఇలా చాలా అంటే చాలా. ఆఖరికి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా స్టార్ట్ అయింది.

మారుతి తన స్టయిల్ లో సూపర్ ఫాస్ట్ గా బండి లాగిస్తున్నారు అనేసరికి మళ్లీ కరోనా వచ్చేసింది. దీంతో ఇప్పడు షూటింగ్ ను ఆపేసారు. ఇక ఇప్పుడు చేసినా డేట్ పెర్ ఫెక్ట్ గా వుంటుందో వుండదో తెలియదు. పైగా దీనికన్నా ముందు సీటీమార్ సినిమా విడుదల కావాలి. 

ఇప్పటికిప్పుడు అర్జెంట్ గా కంప్లీట్ చేసినా, డేట్ చూడాలి. థియేటర్లు తెరవాలి. రేట్ల సంగతి తెలియాలి. ఇలా చాలా అంటే చాలా వున్నాయి. అందుకే టెంపరరీగా ఈ సినిమా షూటింగ్ ను అబేయన్స్ లో పెట్టింది గీతా సంస్థ. 

అదే సంస్థ నిర్మిస్తున్న బ్యాచులర్ సినిమా విడుదలకు రెడీగా వుంది. అలాగే నిఖిల్ తో18 పేజీస్ సినిమా రెడీ అవుతోంది. కరోనా వల్ల ఇవన్నీ ఎక్కడివి అక్కడ అన్నట్లు వున్నాయి. వాటి సరసన మారుతి సినిమా కూడా చేరింది.