రంగంలోకి రానా పేరు

96 అనే తమిళ సినిమా హక్కులు నిర్మాత దిల్ రాజు కొన్న దగ్గర నుంచి రకరకాల పేర్లు వినిపించడం ప్రారంభమయింది. నాని చెన్నయ్ వెళ్లి మరీ స్పెషల్ గా చూసి వచ్చాడు. అల్లు అర్జున్…

96 అనే తమిళ సినిమా హక్కులు నిర్మాత దిల్ రాజు కొన్న దగ్గర నుంచి రకరకాల పేర్లు వినిపించడం ప్రారంభమయింది. నాని చెన్నయ్ వెళ్లి మరీ స్పెషల్ గా చూసి వచ్చాడు. అల్లు అర్జున్ హైదరాబాద్ లోనే స్పెషల్ అరేంజ్ మెంట్స్ చేసుకుని చూసాడు. ఇప్పుడు ఆ సినిమా చెన్నయ్ లో విడుదలయింది. మాంచి టాక్ తో ఆడుతోంది. మంచి సమీక్షలు వచ్చాయి.

కింద సెంటర్లలో ఎలా వున్నా మల్టీ ఫ్లెక్స్ ల్లో మాత్రం మాంచి ఆదరణ వచ్చింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని వినిపిస్తోంది. అయితే విజయ్ సేతుపతి చేసిన ఆ పాత్రకు ఇక్కడ ఏ హీరో సెట్ అవుతారు అన్న సమస్య అలాగే వుండిపోయింది. ఈ పాత్ర స్వభావ స్వరూపాలు అలాంటివి. యంగ్ హీరో పాత్ర కాదు. థర్టీ ప్లస్ హీరో పాత్ర లాంటిది. ఎవరు సూట్ అవుతారు అన్న డిస్కషన్లు సాగుతూనే వున్నాయి.

ఇదిలా వుంటే హీరో రానా ఈ సినిమా గురించి విని, తాను చేస్తా అని అంటున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజకు రానా ఫోన్ చేసి, సినిమా చూస్తా అని, తనకు చేయాలని వుంది అని చెప్పినట్లు తెలుస్తోంది. నాని, బన్నీ ఆలోచనల్లోనే వున్నారు కానీ రానా తను చేస్తా అని చెప్పేసినట్లు తెలుస్తోంది.

ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే, 96 తమిళ సినిమాలో హీరోయిన్ త్రిష. ఈ సినిమా ఆమెకు బాగా పేరు తెచ్చేలా వుంది. ఇక్కడ కూడా త్రిషనే హీరోయిన్ గా తీసుకునే అవకాశం వుంది. త్రిష చిరకాలంగా రానాకు మాంచి ఫ్రెండ్. ఒకప్పుడు అయితే ఇద్దరికీ పెళ్లయిపోతుందన్న రేంజ్ లో గ్యాసిప్ లు వచ్చాయి. ఇప్పుడు రానా ఆ సినిమా మీద ఆసక్తి కనబరుస్తుంటే కాస్త పాత వార్తలు మళ్లీ గుర్తుకు వస్తున్నాయి.