సాధారణంగా పెద్ద హీరోలు సెలబ్రిటీలు సినిమా ఫంక్షన్లకు వచ్చినా, సినిమా ను చూడండి..మీకు నచ్చుతుంది..బాగుంటుంది అని సర్టిఫెకెట్ ఇవ్వరు ఎందుకంటే చాలా మంది సినిమాను చూసి వుండరు కనుక. కొంతమంది చూసి మరీ వస్తారు. అప్పుడు కూడా సరైన జడ్జిమెంట్ వుండకో, మరెందుకో గట్టిగా ఇది సూపర్..నేను చూసా అని కూడా చెప్పరు.
హీరో బన్నీ కి కూడా అస్సలు మొహమాటం లేదు. ఇలాంటి విషయాల్లో కాస్త నిర్మొహమాటంగానే వుంటాడు. అలాంటి బన్నీ నిన్నటికి నిన్న చావు కబురు చల్లగా అనే సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేసాడు.
తాను చూసాను..అద్దిరిపోయింది. మీరు చూడండి మీకూ నచ్చుతుంది అని గట్టిగా చెప్పాడు. మిత్రుడు బన్నీ వాస్ నిర్మాత, తమ హోమ్ బ్యానర్ అని చెప్పాడేమో అని అనుమానించడానికి లేదు.
ఎందుకంటే ఇదేమీ మరీ పెద్ద సినిమా కాదు. లాస్ అయిపోతామేమో అన్న భయం కలిగించే ప్రాజెక్టు కాదు. పైగా అలా చెప్పాలంటే తాను చూసాను, అద్దిరి పోయింది లాంటి పదాలు వాడడు బన్నీ. ఎందుకంటే తేడా వస్తే విడియోలు కట్ చేసి ట్రోల్ చేయడానికి రెడీగా వుంటారు సోషల్ మీడియా జనాలు. ఆ సంగతి బన్నీకి తెలియందీ కాదు.
అన్నీ తెలిసి, ఇంత ఓపెన్ గా, ఇంత బలంగా సర్టిఫికెట్ ఇచ్చాడు అంటే చావుకబురుచల్లగా సినిమాలో సమ్ థింగ్ ఏదో వుండి వుండాలి.