పవన్ ఉక్కు ప్రైవేట్ ఆపించగలరా…?

విశాఖలో జనసేన ఆద్వర్యంలో వారాహి మూడవ విడతకు పవన్ రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 10 నుంచి 19 వరకూ షెడ్యూల్ కూడా ప్రకటించారు.  Advertisement విశాఖలో మొదటి రోజే పవన్ కళ్యాణ్…

విశాఖలో జనసేన ఆద్వర్యంలో వారాహి మూడవ విడతకు పవన్ రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 10 నుంచి 19 వరకూ షెడ్యూల్ కూడా ప్రకటించారు. 

విశాఖలో మొదటి రోజే పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉంటుంది. ఆ తరువాత విశాఖలో పలు నియోజకవర్గాలలో పవన్ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనకు సంఘీభావాన్ని పవన్ ప్రకటిస్తారు అని అంటున్నారు.

అయితే పవన్ గతంలో కూడా ఉక్కు ఆందోళనకు మద్దతు ప్రకటించారని, ఇపుడు సమస్య అంతా కేంద్రం చేతిలోనే ఉందని, అక్కడే పరిష్కారం కూడా ఉందని అంటున్నారు. బీజేపీ జనసేనకు ఎటూ మిత్రపక్షమే కాబట్టి ఆ పార్టీతో మాట్లాడి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పవన్ కళ్యాణ్ ఆపిస్తే మంచిది కదా అని అంటున్నారు. ఉక్కు కార్మికులకు సంఘీభావం తెలిపినంత మాత్రాన సమస్య తీరేది కాదు కదా అని అంటున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి తన మద్దతు ఉంటుందని చెబుతారని అంటున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అంటున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అలాంటి ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోమని కార్మిక లోకం అంటోంది.