‘ఉస్తాద్’ లో రియల్ ఇన్సిడెంట్‌లు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎప్పుడైతే పచ్చ జెండా ఊపారో అప్పటి నుంచి రకరకాల గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది.  Advertisement ఇదిగో కథ…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తరువాత సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కు ఎప్పుడైతే పచ్చ జెండా ఊపారో అప్పటి నుంచి రకరకాల గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభమైంది. 

ఇదిగో కథ అంటే అవిగో డైలాగులు అనే రేంజ్ కు ఈ గ్యాసిప్ లు వెళ్లిపోయాయి. పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్ లు ఎలాగూ వుంటాయి. ఆ విషయం చెప్పడానికి పెద్దగా జోస్యం రానక్కరలేదు. అలాగే పవన్ హీరో కనుక, జనసేన అధిపతి కనుక పొలిటికల్ టచ్ డైలాగులు వుంటాయి. అది కూడా పెద్దగా ఊహాతీతం కాదు.

అయితే ఉస్తాద్ అయితే తెరి సినిమా రీమేక్. ఫక్తు కమర్షియల్ కథ. గతంలో ఈ సినిమాను మైత్రీ సంస్థ పవన్ తోనే రీమేక్ చేసేందుకు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో వర్క్ చేయించింది. చాలా నెలలు సంతోష్ శ్రీనివాస్ వర్క్ చేసి, పకడ్బందీ స్క్రిప్ట్ తయారు చేసారు. అప్పట్లో ఈ ప్రాజెక్టు ఆగిపోవడంతో, సంతోష్ శ్రీనివాస్ కు కొంత రెమ్యూనిరేషన్ ఇచ్చి, స్క్రిప్ట్ తీసుకుని పంపేసారు. ఇప్పుడు అదే స్క్రిప్ట్, కాస్త మార్పు చేర్పులతో ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తోందని భోగట్టా.

ఇప్పుడు ఈ సినిమాకు దర్శకుడు హరీష్ శంకర్ కనుక సంతోష్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ను తన స్టయిల్ కు అనుగుణంగా మార్చుకునే పని ఎలాగూ వుంటుంది. అయితే విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే ఆంధ్రదేశంలో గత నాలుగేళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు సినిమా స్క్రిప్ట్ లో భాగంగా కలపడానికి అవకాశం వుంటుందా అన్నది డిస్కషన్ లో వుందని తెలుస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల ప్రదర్శనకు అప్పట్లో పవన్ హాజరయ్యారు. అలాగే మరి కొన్ని కీలక సంఘటనలు వున్నాయి.

ఇలాంటివి ఏ విధంగా యాడ్ చేసి, ప్రొజెక్ట్ చేయాలనే డిస్కషన్లు సాగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ ఎంత వరకు నిజమో సినిమా రావాలి లేదా షూటింగ్ మొదలు కావాలి. అప్పుడు ఎలాగూ పక్కాగా తెలుస్తుంది. అంత వరకు ఇలా రకరకాల వార్తలు అయితే వినిపిస్తూ వుంటాయి.