47లక్షలకు ఆ చానెళ్లకు హక్కులు

టీవీ 9, ఎన్టీవీలకు అరవింద సమేత వీరరాఘవ ప్రీరిలీజ్ మీట్ ప్రత్యక్ష ప్రసార హక్కులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ నగదు రూపంలో 47లక్షలు అని తెలుస్తోంది. రెండు చానెళ్లు కలిపి…

టీవీ 9, ఎన్టీవీలకు అరవింద సమేత వీరరాఘవ ప్రీరిలీజ్ మీట్ ప్రత్యక్ష ప్రసార హక్కులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ డీల్ విలువ నగదు రూపంలో 47లక్షలు అని తెలుస్తోంది. రెండు చానెళ్లు కలిపి 47 లక్షలు నిర్మాతకు చెల్లించాలి. ఇదికాక, రెండు ఛానెళ్లు కొంత విలువైన ప్రకటనలు ఇవ్వాలి. ఇదీ ప్యాకేజ్ అని తెలుస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు పెద్ద చానెళ్లకు అయదు నుంచి పదిలక్షలు ప్రకటనలకు గాను ఖర్చు చేస్తారు. కానీ ఇప్పుడు ఆ ఖర్చు వుండదు. 

ఇదిగాక జీ టీవీకి కూడా ప్రసారపు అవకాశం ఇచ్చారు. అది కేవలం ప్రకటనలతో లింక్ అని తెలుస్తోంది. వాస్తవానికి త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్ లైవ్ కాస్ట్, అది కూడా రెండు చానెళ్లకు కలిపి 47 లక్షలు అంటే సరసమైన రేటే అన్నది ట్రేడ్ వర్గాల బోగట్టా. అయితే ప్రకటనల ప్యాకేజీ వుంది కాబట్టి నిర్మాతకు లాభమే. 

గతంలో ఎప్పుడూ టీవీ 5కు లైవ్ కాస్ట్ హక్కులు ఇచ్చే హారిక హాసిని సంస్థ ఈసారి ట్రాక్ మార్చి, ఎల్ఎల్ పి చానెళ్లకు హక్కులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలా అని ప్రకటనలు మాత్రం ఎల్ ఎల్ఫీతో సంబంధం లేకుండా అందరికీ ఇచ్చేసారు. టోటల్ గా అరవింద సమేతకు డిఫరెంట్ పబ్లిసిటీ స్కీమ్ తో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.