రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోవిడ్ సోకింది. దాంతో బాబాయ్ కళ్యాణ్ కోసం రామ్ చరణ్ ఏకంగా అపోలో ఆసుపత్రి సెటప్ నే ఫార్మ్ హవుస్ కు తరలించేసారు.
పవన్ కు కొద్ది రోజుల క్రితమే కోవిడ్ అనుమానం కలిగింది. టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చింది. అయినా రోజూ టెంపరేచర్ వస్తుంటే టెనెట్ ల్యాబ్ లో సిటి చేయించారు.మైల్డ్ ఇన్ ఫెక్షన్ అని తేలింది.
దాంతో వెంటనే ఈ విషయం రామ్ చరణ్ కు తెలియచేసారు. దాంతో ఆయన హుటాహుటిన పవన్ కోసం ఆయన ఫామ్ హవుస్ లోనే ఓ ఐసోలేషన్ వార్డ్ ను సెటప్ చేయించారు. అపోలో నుంచి పేషెంట్ బెడ్, అంటెండెట్ బెడ్, ఇతరత్రా సామగ్రిని అర్జంట్ గా తరలించారట. అలాగే మెడికల్ సిబ్బందిని కూడా డిప్యూట్ చేసారు.
జనసేన మీడియా విభాగం ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఈ సందర్భంగా ఓ పిక్చర్ ను కూడా విడుదలచేసారు. ఈ ఫొటోను పవన్ కళ్యాణ్ పర్సనల్ ఫోన్ తోనే తీసినట్లు తెలుస్తోంది.
నిర్మాత నాగవంశీ మిత్రుడు డాక్టర్ సుమన్ కరోనా లక్షణాలు వచ్చిన దగ్గర నుంచి పవన్ మంచి చెడ్డలు చూస్తున్నారు. ఇప్పుడు అపోలో వైద్యులు కూడా తోడయ్యారు.